కొత్త రికార్డుల స్వాగతం
కొత్త ఆర్థిక సంవత్సరానికి(2014-15) స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో స్వాగతం పలికాయి. గత ఆరు రోజులుగా లాభాల బాటలో సాగుతున్న మార్కెట్లు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మరోసారి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు బలపడి 22,446 వద్ద ముగియగా, 17 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 6,721 వద్ద స్థిరపడింది. అంతేకాకుండా ఇంట్రాడేలో గరిష్టంగా 22,486, నిఫ్టీ 6,732ను తాకాయి. వెరసి స్టాక్ మార్కెట్ చరిత్రలో వరుసగా ఏడో రోజు ఇండెక్స్‌లు కొత్త రికార్డులను నెలకొల్పగలిగాయి! ఎఫ్‌ఐఐలు రూ. 386 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 248 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.
ఐటీకి డిమాండ్
మంగళవారం ట్రేడింగ్‌లో ఐటీ, ఆయిల్ రంగాలు 1% పుంజుకోగా, బ్యాంకింగ్, రియల్టీ అదే స్థాయిలో డీలాపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో విప్రో, సెసాస్టెరిలైట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ 3-1% మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, మారుతీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భెల్, ఎస్‌బీఐ 2.5-1% మధ్య నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, ఎఫ్‌డీసీ, నెట్‌వర్క్ 18, మోనట్ ఇస్పాత్, బాంబే బర్మా, పీవీఆర్, టాటా కాఫీ, గీతాంజలి జెమ్స్, బజాజ్ హిందుస్తాన్, ఈఐడీ ప్యారీ, హెక్సావేర్ 12-6% మధ్య పురోగమించాయి.