ఆర్బీఐ ప్రకటన: మార్కెట్లు క్రాష్
ఆర్బీఐ ప్రకటన: మార్కెట్లు క్రాష్
Published Wed, Dec 7 2016 4:22 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM
కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ పాలసీ సమీక్షలో వెల్లడించగానే మార్కెట్లు కుప్పకూలాయి. విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ప్రకటన రావడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్లు క్రాష్ అయ్యాయి. అనంతరం కొంచెం కోలుకుని చివరికి సెన్సెక్స్ 156 పాయింట్ల నష్టంలో 26,237వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంలో 8,100 వద్ద ముగిసింది. రేట్ల కోతపై భారీ ఆశలు పెట్టుకున్న మార్కెట్లు ఆర్బీఐ ప్రకటనకు ముందు సెన్సెక్స్ 150 పాయింట్లు లాభంలో, నిఫ్టీ 8,190.45 గరిష్టస్థాయిలో నడిచాయి. కానీ ప్రకటన అనంతరం అమ్మకాల ఒత్తిడి కొనసాగి మార్కెట్లు పడిపోయినట్టు విశ్లేషకులు చెప్పారు. రేట్ సెన్సిటివ్ స్టాక్స్ బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ షేర్లు భారీగా నష్టపోయాయి.
బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ 1 శాతం, రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 1.2 శాతం పడిపోయాయి. రేట్ సెన్సిటివ్ షేర్లు కాని ఎఫ్‌ఎమ్సీజీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఫార్మా, కన్సూమర్ డ్యూరెబుల్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కొనసాగినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. సన్ఫార్మా నిఫ్టీలో టాప్ లూజర్గా నిలిచింది. ఈ కంపెనీ షేరు 6 శాతం పడిపోయి రూ.664గా ముగిసింది. బ్యాంకు ఆఫ్ బరోడా, టీసీఎస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకుచ లుపిన్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్లు నష్టాలు పాలవగా.. ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ లాభాల్లో ముగిశాయి.
Advertisement
Advertisement