Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Declared June 4th As Vennupotu Day1
జూన్‌ 4న వెన్నుపోటు దినం: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్‌ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్‌ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్‌ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

YS Jagan Reacts on liquor Scam Says Its Purely CBN Politics2
విజయసాయిలాంటి వాళ్ల స్టేట్‌మెంట్లకు విలువుందా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: చంద్రబాబు మరోసారి తన మంత్ర దండం బయటకు తీశారని.. వ్యస్థలను మేనేజ్‌ చేస్తూ తన మోసాలను ప్రశ్నించేవారి గొంతును నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే.. లిక్కర్‌ స్కాం అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారాయన. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా?. ప్రైవేట్‌ వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా?. ఎక్కడైనా దుకాణాలు 33 శాతం తగ్గిస్తే లంచాలు ఇస్తారా?. 2019-2024 మధ్య లిక్కర్‌ సేల్‌ తగ్గింది. ఒక్క కంపెనీకి లైసెన్స్‌ ఇవ్వలేదు. ట్యాక్స్‌లు పెంచాం. కాబట్టే లిక్కర్‌ కంపెనీలకు లాభాలు పోలేదు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాం. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశాం. ప్రతీ బాటిల్‌పై క్యూఆర్‌ కోడ్‌ పెట్టించాం.లాభాపేక్ష లేకుండా మా(వైఎస్సార్‌సీపీ) ప్రభుత్వం అమ్మకాలు జరిపాం... అసలు లిక్కర్‌ స్కాం (Jagan on Liquor Scam) ఎక్కడ జరిగింది?. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చంద్రబాబు అన్నారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో లిక్కర్‌ సేల్‌ పెరిగింది. కూటమి పాలనలో గల్లీ గల్లీకి బెల్ట్‌ షాపులు వెలిశాయి. బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయడం లేదు.. మద్యాన్ని చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే అవి నడుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త బ్రాండులను తీసుకొచ్చారాయన. గతంలో..(2014-19) తన హయాంలోనూ లిక్కర్‌ సేల్స్‌ పెంచుకుంటూ పోయారు. తద్వారా అమ్మకాలు పెరిగాయి. కాబట్టే లిక్కర్‌ కంపెనీలకు లాభాలు వెళ్లాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. అలాంటప్పుడు స్కాం ఎక్కడ జరిగింది?. డిస్టరీలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మా హయాంలో ఉందా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.గతంలో లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టికి బెయిల్‌ మీద ఉంది నిజం కాదా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు.. లాటరీ పేరుతో రిగ్గింగ్‌ చేసి మద్యం షాపులు దోచుకున్నారు. ఆనాడు కూడా ప్రైవేట్‌ సిండికేట్‌కు మేలు చేశారు. తనకు కావాల్సిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారు. 2015-19 మధ్య ఐదు కంపెనీలు 69 శాతం ఆర్డరులు ఇచ్చారు. తద్వారా కొన్నిబ్రాండ్‌లకు మాత్రమే డిమాండ్‌ సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్‌ సిండికేట్‌కు లబ్ధి చేకూర్చడం కోసం.. తన పాలసీని కొనసాగించడం కోసం.. ఏం స్కాం జరగకపోయినా వైఎస్సార్‌సీపీ హయాంలో లిక్కర్‌ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. భయపెట్టి.. బెదిరించి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి.. తప్పుడు వాంగ్మూలాలతో చంద్రబాబు లిక్కర్‌ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి(V. Vijayasai Reddy). వైఎస్సార్‌సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని.. మూడేళ్ల టర్మ్‌ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి.. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్‌, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది?. లోక్‌సభ ఎంపీ, ఫ్లోర్‌ లీడర్‌ మిథున్‌ రెడ్డికి లిక్కర్‌ కేసుతో ఏం సంబంధం?. ఆయన తండ్రి పెద్దిరెడ్డి కనీసం ఆ శాఖ మంత్రి కూడా కాదు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో కేసిరెడ్డి ఒకరు. కేసిరెడ్డికి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఏం సంబంధం?. విజయవాడ టీడీపీ ఎంపీ, కేసిరెడ్డికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. కేసిరెడ్డి అప్రూవర్‌గా మారలేదని నిందితుడిగా చేర్చారు. కావాల్సిన స్టేట్‌మెంట్‌ ఇస్తే కేసిరెడ్డిని వదిలేసేవారు. లిక్కర్‌ స్కాంకి సంబంధించి ఒక్క ఫైల్‌ అయినా సీఎంవోకి వచ్చి సంతకం అయినట్లు చూపించగలరా? అని చంద్రబాబుకి సవాల్‌ చేస్తున్నా. కుట్రలు చేసి.. సంబంధం లేని వ్యక్తులనూ తెరపైకి తీసుకొచ్చి లిక్కర్‌ కేసులంటూ తప్పుడు కేసులు పెడుతూ.. రాజకీయ కక్షకు పాల్పడుతున్నారు. ఐపీఎస్‌లు సంజయ్‌, కాంతిలాల్‌ ఠాణా, జాషువా, విశాల్‌ గున్నీ, ధనుంజయ్‌, రఘురామ్‌ రెడ్డి ఇలా అధికారులను వేధిస్తున్నారు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Arshdeep Singh Set To Make Test Debut For India In England Series: Report3
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. భార‌త జ‌ట్టులోకి స్టార్ ప్లేయ‌ర్‌! ఎవరంటే?

టీమిండియా స్టార్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ త్వ‌ర‌లోనే టెస్టు అరంగేట్రం చేయ‌నున్నాడు. ఇంగ్లండ్ ప‌ర్య‌టన‌కు 26 ఏళ్ల అర్ష్‌దీప్‌ ఎంపిక చేయాల‌ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాల‌ని ఈ పంజాబ్ పేస‌ర్‌కు సెల‌క్ట‌ర్లు సూచించిన‌ట్లు స‌మాచారం.అర్ష్‌దీప్ రాక‌తో భార‌త టెస్టు జ‌ట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ లేని లోటు తీర‌నుంది. కాగా వ‌న్డే, టీ20ల్లో భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయ‌లేదు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో రెగ్యూల‌ర్‌గా ఆడుతున్న‌ప్ప‌టికి టీమిండియా త‌రపున టెస్టుల్లో ఆడే అవ‌కాశం మాత్రం సింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ టూర్‌తో అత‌డు మూడు ఫార్మాట్ల‌లోనూ అరంగేట్రం చేయ‌డం ఖాయ‌మ‌న్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభ‌వం ఉంది. అక్క‌డి ప‌రిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్ర‌మంలోనే అత‌డిని ఇంగ్లండ్‌కు పంపాల‌ని అగ‌ర్కాక‌ర్ అండ్ కో భావిస్తున్న‌ట్లు వినికిడి.త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 21 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ మే 23న ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టెస్టుల‌కు విడ్కోలు ప‌ల‌క‌డంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానుంది. భార‌త టెస్టు జ‌ట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక దాదాపు ఖార‌రైన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి సైతం టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అత‌డి స్ధానాన్ని ఎవ‌రి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు(అంచ‌నా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్‌, వైభవ్‌ సూర్యవంశీకి చోటు

Heart Breaking Washington Israeli Embassy Couple staffers Incident4
ఉంగరంతో ప్రపోజ్‌ చేద్దామనుకున్నాడు, ఈలోపే..

చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్‌, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్‌లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్‌, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేయాలని యారోన్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్‌ రాయబారి యెచెయిల్‌ లెయిటర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్‌ రోడ్జిగూజ్‌గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్‌

Parameshwara gave a wedding gift to Ranya Rao, says DK Shivakumar5
‘రన్యారావుకు హోంమంత్రి పెళ్లి గిప్ట్‌ ఇచ్చారు’.. ఈడీ రైడ్స్‌పై డిప్యూటీ సీఎం డీకే

సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్‌.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్‌ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్‌ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్‌ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు.

Anakapalle: Police Identify Huge Cyber Den Centered In Atchutapuram6
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్‌ డెన్‌ గుట్టురట్టు

సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్‌ డెన్‌ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్‌లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్‌మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్‌మెంట్‌ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.

Are Robots Replacing Humans Faster7
ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులు

ఏఐ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం దాదాపు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతోంది. హ్యుమానాయిడ్ రోబోలు ప్రతి పనిలోనూ ఊహించినదానికంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. మానవుల కంటే వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో మనుషులు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పటికే జపాన్, చైనా వంటి దేశాల్లో రోబోలను నిర్మాణ పనులలో ఉపయోగిస్తున్నారు. ఇవి మనుషుల కంటే వేగంగా గోడ కేట్టేస్తున్నాయి, ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తున్నాయి. నిర్మాణ పరిశ్రమలో రోబోలు గణనీయమైన మార్పులు తెస్తున్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.చైనాలో కొన్ని రోబోలను రాత్రి సమయంలో గ్యాస్ స్టేషన్‌లలో సేవలకు నియమించారు. ఇవి కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాత్రి సమయంలో మనుషులు పని చేయడం కొంత కష్టమే. కానీ రోబోలు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా.. పనిచేస్తూ ముందుకు సాగుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ.. సూచిక బోర్డులను వేయడంలోనూ రోబోలు పనిచేస్తున్నాయి.ఇప్పటికే విమానాశ్రయాలు, హోటల్స్ లేదా రెస్టారెంట్లలో.. రోబోలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనుషుల స్థానంలో ఇవి పనిచేస్తూ.. నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. ఫ్యాక్టరీలో సర్వీసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ వంటి పనుల్లో కూడా రోబోల వినియోగం ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఎలక్ట్రిక్ సమస్యలను క్లియర్ చేయడంలో కూడా రోబోలు పాత్ర ప్రశంసనీయం. హై వోల్టేజ్ పవర్ మరమ్మత్తుల సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ రంగంలో రోబోలను ఉపయోగించడం వల్ల.. ప్రాణహాని ఉండదు. అంతే కాకుండా పని కూడా వేగవంతం అవుతుంది. మొత్తం మీద ప్రతి రంగంలోనూ మాయ చేస్తున్నట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. View this post on Instagram A post shared by AI researches | AI (@airesearches)

Tdp Mla Bandaru Satyanarayana Murthy Sensational Comments8
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు

సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

Bengaluru Mystery Man Buys A Rs.200 Crore Private Jet Ambani Pandit shares video9
రూ. 200 కోట్ల ప్రైవేట్‌ జెట్‌కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్‌ వైరల్‌

200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్‌ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్‌ జెట్‌ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్‌ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్‌కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‌పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్‌లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్‌స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్‌లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్‌ల వరకు థ్రస్ట్‌ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్‌లో అధునాతన ఫీచర్స్‌, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!

Kesari : Chapter 2 Movie Review In Telugu10
‘కేసరి: చాఫ్టర్‌ 2(తెలుగు వెర్షన్‌)’ మూవీ రివ్యూ

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్‌ 2’. కరణ్‌ సింగ్‌ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 18న బాలీవుడ్‌లో రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మే 23న ఇది తెలుగులో రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్‌ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్‌ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్‌ జనరల్‌ డయ్యర్‌ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్‌ నాయర్‌(అక్షయ్‌ కుమార్‌) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్‌ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్‌ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌(అనన్య పాండే)తో జనరల్‌ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్‌ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్‌.మాధవన్‌) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్‌ ఎలా డీల్‌ చేశాడు? డయ్యర్‌ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్‌ దిల్‌రీత్‌ సింగ్‌ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్‌ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్‌ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్‌ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్‌ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్‌ 2’ చిత్రం అవుతుంది. జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్‌ చేసిన న్యాయ పోరుని హైలెట్‌ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్‌ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్‌ వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న శంకరన్‌ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్‌ సింగ్‌ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్‌ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్‌, మెక్‌కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్‌వాలాబాగ్‌ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్‌ నేపథ్యం, కమీషన్‌ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్‌ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్‌ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్‌ తరపున మెక్‌కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్‌ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్‌ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్‌ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్‌ మిస్‌ ఇట్‌. ఎవరెలా చేశారంటే.. సర్‌ శంకరన్‌ నాయర్‌గా అక్షయ్‌ కుమార్‌ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న మెక్‌ కిన్లేగా ఆర్‌ మాధవన్‌ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్‌రీత్‌ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్‌ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్‌ సచ్‌దేవ్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్‌ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement