బ్యాంకుల కనీస రుణ రేటు (బేస్ రేటు) లెక్కింపు విషయంలో అన్ని బ్యాంకులూ ఒకే విధానాన్ని అవలంభించాలని ఆర్‌బీఐ సూచించింది...
ముంబై: బ్యాంకుల కనీస రుణ రేటు (బేస్ రేటు) లెక్కింపు విషయంలో అన్ని బ్యాంకులూ ఒకే విధానాన్ని అవలంభించాలని ఆర్‌బీఐ సూచించింది. ప్రధానంగా ‘మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్’ ప్రాతిపదికన ఈ రేటు నిర్ణయం జరగాలని పేర్కొంది. దీనివల్ల ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు ప్రయోజనం తక్షణం కస్టమర్లకు అందే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం పలు బ్యాంకులు బేస్ రేటు నిర్ణయంలో ‘కాస్ట్ ఆఫ్ ఫండ్స్ సగటు’ను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. ఈ అంశంపై తాజాగా ఆర్‌బీఐ కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తూ, 2016 ఏప్రిల్ 1 నుంచీ తాజా విధానం అమలయ్యేలా చర్యలు ఉండాలని సైతం బ్యాంకులకు సూచించింది.