ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న చైనా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 1.8% నుంచి 1.7%కు తగ్గిస్తున్నట్లు సోమవారం తెలిపింది.
చైనా ఊహించిన దాని కంటే గత వారం వెలువడిన రెండో త్రైమాసిక ఆర్థిక డేటా నిరాశజనకంగా ఉన్నా కీలక వడ్డీరేట్లలో కోతలు విధించడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే ‘ప్లీనం సమావేశం’లో భాగంగా వడ్డీ కోతలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) ఏడు రోజుల రివర్స్ రెపో రేటును 1.8% నుంచి 1.7%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను 3.45% నుంచి 3.35%కి తగ్గించింది.
చైనాలో దీర్ఘకాల ఆస్తి సంక్షోభం పెరుగుతోంది. అప్పులు అధికమవుతున్నాయి. వస్తు వినియోగం తగ్గుతోంది. చైనా ఎగుమతుల ఆధిపత్యం పెరగడంతో ఇతర ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో చైనాలో వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించడం విశేషం.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..
అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జొరొమ్ పావెల్ ఇటీవల వడ్డీరేట్లును పెంచబోమని ప్రకటించారు. దాంతో అంతర్జాతీయంగా వడ్డీరేట్లు పెంపుపై కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న మానిటరీ పాలసీ సమావేశాల్లో భాగంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కూడా ఈమేరకు వడ్డీరేట్లును తగ్గించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment