ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటును పావు శాతం పెంచిన 24 గంటల్లోనే కోటక్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను సవరించింది. రుణ రేట్లు డిపాజిట్ రేట్లతో అనుసంధానమై ఉంటాయని తెలిసిందే.
రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 7.10 శాతానికి చేరింది. రూ.2–5 కోట్ల డిపాజిట్లపై రేటు 7.25 శాతానికి చేరింది. ‘‘ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈ ప్రయోజనాన్ని మా విలువైన కస్టమర్లకు బదిలీ చేయాలని, వారి పొదుపు నిధులపై అధిక రాబడులను ఆఫర్ చేయాలని నిర్ణయించాం’’అని కోటక్ బ్యాంక్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment