కీలక వడ్డీ రేట్లన్నీ యథాతథం | repo rate kept unchanged by raghuram rajan | Sakshi
Sakshi News home page

కీలక వడ్డీ రేట్లన్నీ యథాతథం

Published Tue, Jun 3 2014 11:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

కీలక వడ్డీ రేట్లన్నీ యథాతథం

కీలక వడ్డీ రేట్లన్నీ యథాతథం

కీలక వడ్డీ రేట్లను ఏమాత్రం కదిలించకుండా రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ యథాతథంగా ఉంచారు. రెపోరేటును 8 శాతం వద్దే యథాతథంగా ఉంచారు. ఇటీవలి కాలంలో రిజర్వు బ్యాంకు చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా ద్రవ్యోల్బణం కొద్దిమేర నియంత్రణలోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో రిజర్వు బ్యాంకు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీవ్రస్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి రెపోరేటును ఆయన 75 బేస్ పాయింట్ల మేర పెంచారు.

ఈ జనవరి నాటికి ద్రవ్యోల్బణాన్ని 8 శాతానికి నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజన్.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు సుమారు 5-6% ఉంటుందని అంచనా వేశారు. 2016 నాటికి ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతానికి నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement