నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష | RBI set for third interest rate cut of the year on stable inflation | Sakshi
Sakshi News home page

నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

Published Tue, Jun 2 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

నేడు ఆర్‌బీఐ పాలసీ సమీక్ష

రేట్ల కోతకు అవకాశం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%)ను పావుశాతం తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించి వృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం కూడా ఆకాంక్షిస్తోంది.

ఈ ఏడాది రెండుసార్లు  (జనవరి 15, మార్చి 4) పావు శాతం చొప్పున మొత్తం అరశాతం రెపో రేటును ఆర్‌బీఐ తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని  ‘రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా’ కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకులకు సంకేతాలిచ్చింది. అయినా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించారు కూడా.

ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు పావుశాతం మేర రుణ రేట్లను తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తాజా పరపతి సమీక్ష జరగనుంది.  ద్రవ్యోల్బణం కట్టడి, పారిశ్రామిక మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ రుణ రేటు మరోదఫా తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement