Cutting rates
-
రోడ్డెక్కిన అన్నదాతలు
సారంగపూర్(నిర్మల్) : ధాన్యం తూకంలో కోత విధించొద్దని డిమాండ్ చేస్తూ మండలంలోని మలక్‌చించోలి గ్రామ రైతులు ఆదివారం రోడ్డెక్కారు. నిర్మల్–స్వర్ణ ప్రధాన రహదారిపై ఎక్స్‌రోడ్డు వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై సునీల్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమి రా అన్నారు. అనంతరం కౌట్ల(బి) పీఏసీఎస్ చైర్మన్ అయిర నారాయణరెడ్డి, ఏఎంసీ అధ్యక్షుడు రాజ్‌మహ్మద్, అడెల్లి ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వద్దకు చేరుకున్నారు. రైతుల సమస్య పరిష్కరించడంతో వారు ఆందోళన విరమించారు. వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ముందే ధాన్యం కేంద్రాలకు తరలించినా కొనుగోళ్ల విషయంలో నిర్వాహకులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తడవకున్నా తడిసిందంటూ తూకంలో కోతలు విధించడం సబబు కాదన్నారు. గతంలోనే చాలాసార్లు కొనుగోళ్లు వేగిరం చేయాలని పదేపదే వేడుకున్నా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వా పోయారు. ధాన్యం తడవడానికి కారణం కేంద్రాల్లోని నిర్వాహకుల నిర్లక్ష్యమేనన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కోతలు విధించకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
రేట్ల కోత ఆశలతో..
రికార్డ్ స్థాయికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం - అంచనాలను మించిన పారిశ్రామికోత్పత్తి - రెండు వారాల గరిష్టానికి స్టాక్ సూచీలు - 246 పాయింట్ల లాభంతో 25,857కు సెన్సెక్స్ - 83 పాయింట్ల లాభంతో 7,872కు నిఫ్టీ రేట్ల కోత ఆశలతో వారం ప్రారంభ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ శుభారంభం చేసింది. ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం మరింత తగ్గడం, జూలై పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలను మించిడంతో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో రెండు వరుస ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 246 పాయింట్లు లాభంతో 25,857 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 7,872 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు, నిఫ్టీకి కూడా ఇది రెండు వారాల గరిష్ట స్థాయి. బ్యాంక్, లోహ, విద్యుత్తు, , పీఎస్‌యూ, రియల్టీ షేర్లు పెరిగాయి. వినియోగవస్తువుల సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. బ్యాంక్ షేర్ల ర్యాలీ: కీలక రేట్ల కోత ఆశలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. కాగా సోమవారం ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల అధిపతులతో జరిగే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విద్యుత్ రంగ రుణ సమస్యపై ఒక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందన్న వార్త కూడా బ్యాంక్ షేర్ల పెరుగుదలకు ఒక కారణమైంది. విద్యుత్ రంగ సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.53,000 కోట్లుగా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1-3 శాతం రేంజ్లో పెరిగాయి. దిగుమతయ్యే ఉక్కు ఉత్పత్తులపై 20 శాతం సుంకం విధించడానికి ప్రభుత్వం యోచిస్తుందన్న వార్తల కారణంగా లోహ షేర్లు-టాటా స్టీల్, వేదాంత, హిందాల్కో 3.5-4 శాతం రేంజ్లో పెరిగాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ వార్తలను ప్రభుత్వం ద్రువీకరించింది. 30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.1,978 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.12,444 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,57,528 కోట్లుగా నమోదైంది. దివీస్ ల్యాబరేటరీస్ బోనస్ షేర్లకు రికార్డు తేదీని సెప్టెంబర్ 26గా నిర్ణయించింది. -
రేటు తగ్గినా.. వరుణుడి కరుణ లేదని...
* సెన్సెక్స్ 661 పాయింట్లు నష్టంతో 27,188 పాయింట్లకు డౌన్ * 197 పాయింట్ల నష్టంతో 8,236కు నిఫ్టీ ఈ ఏడాది మరోసారి రేట్ల కోత ఉండబోదని ఆర్బీఐ సూచనప్రాయంగా వెల్లడించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ, ఈ ఏడాది రేట్ల కోత బహుశా ఇదే చివరిసారని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ పేర్కొనడం మార్కెట్లకు రుచించలేదు. దీనికి తోడు వర్షాలు ఆలస్యమవడమే కాకుండా, తగినంతగా కురవవనే అంచనాలు, రూపాయి 26 పైసలు క్షీణించడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 661 పాయింట్లు క్షీణించి 27,188కు, నిఫ్టీ 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిశాయి. సాధారణంగా రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసేది. కానీ రేట్ల కోత కారణంగా స్టాక్ మార్కెట్ పతనమవడం ఇది వరుసగా రెండోసారి. ‘వడ్డీరేట్ల’ షేర్లు కుదేలు... వర్షాలు సాధారణం కంటే తక్కువగానే పడతాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కరువు పరిస్థితులేర్పడుతాయోమోననే ఆందోళనను రేకెత్తించాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, పంట దిగుబడులు తగ్గే అవకాశాలు, తదితర కారణాలతో ద్రవ్యోల్బణం ఇక నుంచి పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత-రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు కుదేలయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు జరిగాయి. కరువు మబ్బులు... ఉత్పత్తి వ్యయాలు పెరుగుతుండడం ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత కంపెనీల లాభదాయకతపై మరింతగా ప్రభావం చూపుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ధకన్ చెప్పారు. కరువు ఆందోళనలను రేకెత్తించేలా ఉన్న వాతావరణ శాఖ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయని, 50 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ కోతను మార్కెట్లు అంగీకరించవనే అంచనాలు నిజమయ్యాయని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. 756 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత 27,903 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించగానే నష్టాల్లోకి జారిపోయింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 27,147 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 661 పాయింట్ల (2.37 శాతం) నష్టంతో 27,188 వద్ద ముగిసింది. మే 6 తర్వాత ఒక్క రోజులో సెన్సెక్స్ ఇంతలా క్షీణించడం ఇదే తొలిసారి. 8,445-8,226 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 197 పాయింట్లు(2.3 శాతం) నష్టంతో 8,236 వద్ద ముగిసింది. ఎదురీదిన ఎయిర్టెల్ 30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క ఎయిర్టెల్ తప్ప అన్ని షేర్లూ కుదేలయ్యాయి. అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ నష్టపోయింది. ఈ షేర్ 4.28% క్షీణించి రూ.266 వద్ద ముగిసింది. యాక్సిస్ బ్యాంక్ 4.2%, ఐసీఐసీఐ బ్యాంక్ 3.7%, హెచ్డీఎఫ్సీ 3.55%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.6% చొప్పున క్షీణించాయి. బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 3.4 % క్షీణించింది. 1,875 షేర్లు నష్టపోగా, 804 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,087 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,983 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,93,660 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.594 కోట్ల నిర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.272 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. రూ.2.26 లక్షల కోట్లు ఆవిరి... ఇన్వెస్టర్ల సంపద మంగళవారం రోజే రూ.2.26 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.101.05 లక్షల కోట్లకు తగ్గింది. ఎందుకీ పతనం..? ⇒ వర్షాలు సాధారణం కంటే తక్కువేనన్న ⇒ వాతావరణ శాఖ ⇒ ఇప్పట్లో రేట్ల కోత ఉండకపోవచ్చన్న ఆర్బీఐ ⇒ రూపాయి 26 పైసలు క్షీణించడం... -
గృహ, వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మంగళవారం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్ పరపతి విధానంపై సమీక్ష అనంతరం ఈ వివరాలను ప్రకటించారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు) ను పావుశాతం తగ్గించింది. నగదు. నిల్వల నిష్పత్తి ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా ఉంటాయని ప్రకటించింది. ఫలితంగా గృహరుణాలపై ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. ఈసందర్భంగా పెట్టుబడులు ఇంకా బాగా పెరగాలని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్తంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.. ఆర్థికరంగం ఇంకా కోలుకునే దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఆర్బీఐ ప్రకనటతో స్టాక్‌మార్కెట్లు నెగిటివ్‌గా స్పందించాయి. దాదాపు 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. రెపో రేటును తగ్గించి ఆ ప్రయోజనాన్ని రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని ఆర్బీఐ ఆకాంక్షించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడిచేసేందుకు, రెపో రేటును తగ్గించాలని, అభివృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం గతంలో ఆర్బీయైకి సూచించింది. ప్రస్తుతమున్న 7.5 శాతం వడ్డీరేటు తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరాయి. కాగా గత జనవరి, మార్చిలో కూడా రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ప్రధానంగా ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడులకు ఊతమిచ్చి తద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత జోరందుకునేలా చేయడంపై ఆర్బీఐ దృష్టిపెట్టింది. ద్రవ్యోల్భణం జనవరి 2016 నాటికి6శాతంగా ఉండవచ్చని ఆర్బిఐ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4 శాతానికి కట్టడి చేయడం కూడా ఆర్బిఐ తన పాలసీ విధానంలో టార్గెట్ పెట్టుకుంది. -
నేడు ఆర్బీఐ పాలసీ సమీక్ష
రేట్ల కోతకు అవకాశం! న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5%)ను పావుశాతం తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో రెపో రేటును ఆర్బీఐ తగ్గించి వృద్ధికి ఊతం ఇవ్వాలని కేంద్రం కూడా ఆకాంక్షిస్తోంది. ఈ ఏడాది రెండుసార్లు (జనవరి 15, మార్చి 4) పావు శాతం చొప్పున మొత్తం అరశాతం రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. ఆ ప్రయోజనాన్ని ‘రుణాలపై వడ్డీరేట్లు తగ్గించటం ద్వారా’ కస్టమర్లకు బదలాయించాలని బ్యాంకులకు సంకేతాలిచ్చింది. అయినా బ్యాంకులు ఈ మేరకు నిర్ణయం తీసుకోకపోవడం ‘నాన్సెన్స్’ అంటూ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏప్రిల్ 7 పాలసీ సమావేశం సందర్భంగా ఆగ్రహించారు కూడా. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు పావుశాతం మేర రుణ రేట్లను తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తాజా పరపతి సమీక్ష జరగనుంది. ద్రవ్యోల్బణం కట్టడి, పారిశ్రామిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ రుణ రేటు మరోదఫా తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.