రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెండు రోజుల సమీక్ష తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడించారు. ఇందులో భాగంగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఆర్‌బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశమైన తర్వాత దాస్ ప్రకటన వెలువడింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది నాలుగోసారి. అయితే జూలైలో టొమాటో, ఇతర కూరగాయల ధరల కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది.
— ReserveBankOfIndia (@RBI) October 6, 2023
Comments
Please login to add a commentAdd a comment