రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'శక్తికాంత దాస్' నేతృత్వంలోని 6 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో రేపో రేటు ఎనిమిదోసారి కూడా 6.5 శాతం వద్ద యధాతధంగా ఉంచింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వాస్తవ జీడీపీ వృద్ధిలో పెరుగుదలను ప్రకటించారు. ఇది 7 శాతం నుంచి 7.2 శాతానికి చేరింది. రేపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి.
రెపో రేటు
ఆర్‌బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్‌బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రేపు రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.
రివర్స్ రెపో రేటు
వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్‌బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.
#WATCH | RBI Governor Shaktikanta Das says "...The provisional estimates released by the National Statistical Office (NSO) placed India's real gross domestic product, that is GDP growth at 8.2% for the year 2023-24. During 2024-25, so far the domestic economic activity has… pic.twitter.com/PL9hSfcqpo
— ANI (@ANI) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment