
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. కరోనా బారినపడి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే రికవరీ రేటు 82 శాతం దాటిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ర్ట వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,22,793 కాగా 3628 మంది మరణించారు. అయితే ప్రస్తుతం 16,031యాక్టివ్ కేసులే ఉన్నాయని 1,03,134 మందికి పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడి దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా 685 కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు 8,18,989 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలోనే అత్యధిక కరోనా ప్రభావిత రాష్ర్టాల్లో ఢిల్లీ ఒకటి. ఈ నేపథ్యంలో రికవరీ రేటు పెరగడం అధికారుల్లో ఉపశమనం కలిగిస్తుంది. (తిరిగి విధుల్లో చేరిన ఢిల్లీ ఆరోగ్యమంత్రి)