న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ప్రతి రోజు 45 వేలకు పైగా కేసులు వెలుగు చూడటం సర్వసాధారణమైపోయింది. అయితే భారీగా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతే భారీ స్థాయిలో కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతోందని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలు దాటగా ఇందులో 10 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. కరోనాతో పోరాడుతున్న 5 లక్షలమంది కంటే దాని నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపు కావడం విశేషం. అలాగే ప్రతివారం కరోనా పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతి 10 లక్షల మందిలో 324 మందికి వైరస్ పరీక్షలు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు కోటి 82 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. మరోవైపు కోవిడ్‌ను నివారించేందుకు పరీక్షిస్తున్న 14 వ్యాక్సిన్లు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొంది. (కర్ఫ్యూ ఎత్తివేత)
చదవండి: (15 లక్షలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment