బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటైన ఆపరేషన్ థియేటర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా దాడి ఆగడం లేదు. బుధవారం తాజాగా మరో 67,151 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,474కు చేరుకుంది. 24 గంటల్లో 63,173 మంది కోలుకోగా, 1,059 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59,449కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,67,758కు చేరు కోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,267గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.87గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న కేసులు 17,60,489 ఎక్కువ ఉన్నాయి. అంతేగాక యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.30 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది.
మరణాల రేటు క్రమంగా 1.80 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 25 వరకు 3,76,51,512 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం మరో 8,23,992 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. తాజా 1,059 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 329 నమోదయ్యాయి. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగు తున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళు తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1524 ల్యాబుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment