
చెన్నై : తమిళనాడులో మహమ్మారి వేగంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఏకంగా 817 తాజా కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. తాజా కేసులతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,545కు పెరిగింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 133కు ఎగబాకింది. ఇక కరోనా నుంచి కోలుకుని 567 మంది డిశ్చార్జి కావడంతో రికవరీ అయిన వారి సంఖ్య 9909కు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment