న్యూఢిల్లీ: తాజాగా ఇచ్చిన నోటీసులతో కలిపి ఆదాయపన్ను శాఖకు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన రికవరీ సొమ్ము మొత్తం రూ.3567 కోట్లకు చేరింది. 2014-15,2015-16, 2016-2017,2017-18 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం రూ.3567 కోట్ల ట్యాక్స్ రికవరీ నోటీసులను రెండు విడతల్లో ఐటీ శాఖ కాంగ్రెస్‌కు పంపింది.
రాజకీయ పార్టీలకు ట్యాక్స్ రాయితీలు తొలగించడం కారణాంగానే కాంగ్రెస్ సేకరించిన మొత్తం విరాళాలపై పన్ను కట్టాల్సిందేనని ఐటీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సవరించిన పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించడంతోనే నోటీసుల్లో డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది.
ఇంత భారీ మొత్తం డిమాండ్ నోటీసులను ఐటీ శాఖ తమ పార్టీకి పంపడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత తాము తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, మళ్లీ ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment