న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని ఆదాయపన్ను శాఖ(ఐటీ) వెంటాడుతోంది. శుక్రవారమే(మార్చ్ 29)రూ.1800 కోట్ల మేర ఆదాయపన్ను రికవరీ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా మరో రెండు నోటీసులను ఐటీ శాఖ పంపిందని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ చెప్పారు. ఈ నోటీసులు శనివారం రాత్రి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ట్యాక్స్ టెర్రరిజానికి కాంగ్రెస్ టార్గెట్‌గా మారిందని జైరామ్ ఫైర్ అయ్యారు.
కాగా, 2017-18 నుంచి 2020-21 ఆదాయపన్ను అసెస్‌మెంట్ సంవత్సరాలకుగాను పెనాల్టీ, వడ్డీని కలిపి రూ.1800 కోట్ల పన్ను కట్టాలని శుక్రవారం ఇచ్చిన నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. నాలుగేళ్ల రిటర్న్స్‌పై రీఅసెస్‌మెంట్ ప్రొసిడింగ్స్ ప్రారంభించాలన్న ఆదాయ పన్ను శాఖ ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఐటీ రికవరీ నోటీసులు పంపింది.
2014-15, 2015-16,2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆదాయ పన్ను రిటర్నులను కూడా రీ అసెస్‌మెంట్ చేసే చర్యలు ఐటీ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 135 కోట్ల మేర నగదును ఫ్రీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment