
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ప్రతికూల ప్రపంచ సూచనల మధ్య సెన్సెక్స్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా కుప్పకూలింది. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్ల లాభాలతో నష్టాలనుంచి తెప్పరిల్లాయి. కానీ ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అటు అదానీ గ్రూపు షేర్లలో లాభాల బుకింగ్ కనిపిస్తోంది. దీంతో బనిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 18306 వద్ద, 121 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 61864 వద్ద కొనసాగుతున్నాయి.
సన్ ఫార్మా, టైటన్, డా.రెడ్డీస్, హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్లు ఉండగా, కాఅదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్ నష్టపోతున్నాయి. అటు ఎస్‌బీఐ,ఐసీఐసీఐ, పీఎన్‌బీ తదితర బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment