Today StockMarket Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు చాలా పటిష్టంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలనుంచి వెనక్కి తగ్గినప్పటికీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తగ్గేదెలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 474.46 పాయింట్లు లేదా 0.71శాతం లాభంతో 67,572 వద్ద, నిఫ్టీ 146.00 పాయింట్లు లేదా 0.74శాతం ఎగిసి 19,979.20 ముగిసింది. వరుస రికార్డులతో దూసుకుపోతున్న సూచీలు గురువారం కూడా రెండూ ఆల్ టైం హైని నమోదు చేయడమే కాదు, రికార్డ్ క్లోజింగ్ వద్ద స్థిరపడ్డాయి. అలాగే ఎనలిస్టుల అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 20వేల దిశగా పరుగులు తీస్తోంది.
సెక్టార్లలో, ఎఫ్‌ఎంసిజి, బ్యాంక్ ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.8 శాతం, పవర్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్ నోట్‌లో ముగిశాయి. ఐటీసీ, కోటక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, డా. రెడ్డీస్, సిప్లా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు రిలయన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ , బజాజ్‌ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
అటు డాలరు మారకంలో రూపాయి 10 పైసలు ఎగిసి 81.99 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి
Comments
Please login to add a commentAdd a comment