
Today Stock Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్ నోట్‌తో ముగిశాయి. ఆరంభం నుంచి లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్ ముగింపులో మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 29 పాయింట్లు క్షీణించి 66,356 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19,681 వద్ద స్థిరపడ్డాయి. దీంతో నిఫ్టీ 19700 దిగువకు చేరింది.
సెక్టార్ల పరంగా మెటల్ పవర్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరగగా, పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్, FMCG , రియల్టీ 0.5-1 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున పెరిగాయి.
నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎన్‌టిపిసి ,అల్ట్రాటెక్ సిమెంట్ టాప్ గెయినర్లు కాగా, నష్టపోయిన వాటిలో ఏషియన్ పెయింట్స్, ఐటిసి, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ , లార్సెన్ అండ్ టూబ్రో ఉన్నాయి.
రూపాయి: గత ముగింపు 81.82తో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా తగ్గి 81.87 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)