ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్య దేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు (0.01%) పెరిగి 55,949.10 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 2.20 పాయింట్లు (0.01%) లాభపడి 16,636.90 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.23 వద్ద నిలిచింది.
బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగియగా.. భారతి ఎయిర్ టెల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, మారుతి సుజుకి, హిందాల్కో ఇండస్ట్రీస్ పవర్ గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను చూశాయి.(చదవండి: బంగారం ధరలు: మరింత ప్రియం!)
Comments
Please login to add a commentAdd a comment