
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు చివర్లో నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి. తద్వారా 5 రోజుల లాభాలకు చెక్ పడింది.
అమెరికా జాబ్ రిపోర్ట్ తరువాత ఫెడ్ రేట్ల పెంపు భయాలతో ఐటీ షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్, బీపీసీఎల్, టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. దివీస్, హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదాంత టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
అటు డాలరుమారకంలో రూపాయి సెప్టెంబర్ 22 తర్వాత అతిపెద్ద నష్టాన్ని నమోదు చేసింది. 1.10 నష్టంతో 82. 72 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment