ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయ ఐటీ, మెటల్, ఫైనాన్షియల్ స్టాక్స్ మద్దతుతో మార్కెట్ లాభాల్లోకి దూసుకెళ్లింది. చివరకు, బీఎస్ఈ సెన్సెక్స్ 209.36 పాయింట్లు (0.40%) పెరిగి 52653.07 వద్ద స్థిరపడితే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 69.10 పాయింట్లు (0.44%) పెరిగి 15778.50 వద్ద ముగిసింది. నేడు సుమారు 1781 షేర్లు అడ్వాన్స్ చేయబడ్డాయి, 1170 షేర్లు క్షీణించాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.28 వద్ద ఉంది.
మెటల్ ఇండెక్స్ 5 శాతం లాభపడగా, ఐటీ, పీఎస్ యు బ్యాంక్, రియాల్టీ సూచీలు 1-3 శాతం పెరిగాయి. అయితే ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1 శాతం తగ్గింది. బిఎస్ ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4-0.9 శాతం పెరిగాయి. మార్కెట్లో హిందాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్‌బీఐ, జెఎస్ డబ్ల్యు స్టీల్ షేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మారుతి సుజుకీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఆటో, ఐటీసీ, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment