ఆర్‌ఐఎల్‌,అదాని పవర్‌పై ఫోకస్‌ | Stocks in the news today | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఎల్‌,అదాని పవర్‌పై ఫోకస్‌

Published Tue, Jun 2 2020 10:25 AM | Last Updated on Tue, Jun 2 2020 10:27 AM

Stocks in the news today - Sakshi

క్యూ4 ఫలితాలు: బ్రిటానియ ఇండస్ట్రీస్‌, మదర్‌సన్‌సుమి సిస్టమ్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక  ఫలితాలను మంగళవారం వెల్లడించనున్నాయి.

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో తనకున్న వాటాలో రూ.6,800 కోట్లు విలువైన 2.83 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఉదయ్‌ కోటక్‌ వెల్లడించారు.

ఆర్‌ఐఎల్‌:జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ చురుకుగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అశోక్‌లేలాండ్‌: మే నెలలో 89 శాతం వాణిజ్య విక్రయాలు తగ్గి 1,420 యూనిట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే నెలలో వాణిజ్య వాహన విక్రయాలు 13,172 యూనిట్లుగా ఉన్నాయి.

వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌: మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం47.49 శాతం తగ్గి రూ.32.23కోట్లకు చేరిందని ఈ కంపెనీ తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.61.38 కోట్లుగా ఉందని బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో ఈ కంపెనీ పేర్కొంది.

అదాని పవర్‌: అదాని గ్రీన్‌ ఎనర్జీ, అదాని పవర్‌లు కలిసి ఈక్విటి షేర్ల ఇష్యూ ద్వారా ఒక్కో కంపెనీ రూ.2,500 కోట్లు చోప్పున నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరినట్లు 2019-20 సంబంధిత వార్షిక నివేదికలో పేర్కొన్నాయి.

టాటాపవర్‌: టీపీ సెంట్రల్‌ ఒడిషా డిస్టిబ్యూషన్‌ లిమిటెడ్‌(టీపీసీఓడీఎల్‌)లో రూ.178.5 కోట్ల విలువైన 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు టాటా పవర్‌వెల్లడించింది.

వెలస్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌:మార్చితో ముగిసిన క్యూ4లో ఏకీకృత నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ.89.08 కోట్లకు చేరిందని ఈ కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.29.63 కోట్లుగా ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement