సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఆరంభంనుంచీ స్తబ్ధుగా ఉన్న సూచీలు చివరికి భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 62,922వద్ద, 72 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,684 వద్ద 18,700 మార్క్ దిగువన ముగిసింది.
సెక్టార్లలో, బ్యాంకింగ్ , రియల్టీ సూచీలు దాదాపు 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. మేజర్‌గా ఫార్మా ఇండెక్స్ 1.4 శాతం ఎఫ్‌ఎంసిజి 0.5 పెరిగాయి.
అపోలో హాస్పిటల్స్ ,దివీస్ , రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి.అలాగే హీరో మోటో, ఇండస్‌ఇండ్ బ్యాంకు, విపప్రో, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి 14పైసలు నష్టపోయి 82.19 వద్ద ముగిసింది.
మరిన్ని మార్కెట్ అప్‌డేట్స్, బిజినెస్ వార్తల కోసం చదవండి : సాక్షి బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment