
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్న సూచీలు తొలి రెండు గంటలపాటు గ్రీన్‌లో కొనసాగాయి. కానీ మిడ్ సెషన్‌నుంచి ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్ల నష్టాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
సెన్సెక్స్ 223.01 పాయింట్లు లేదా 0.35 శాతం క్షీణించి 62,625.63 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ 71.10 పాయింట్లు లేదా 0.38 శాతం క్షీణించి 18,563.40 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ లాభపడగా,బ్యాంకు, ఐటీ, మెటల్ , ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లునష్టపోయాయి. ఇండస్ ఇండ్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, అదానీ లాభపడగా, హీరోమోటో, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ, దివీస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి.
గత ముగింపు 82.57తో పోలిస్తే డాలర్ మారకంలో భారత రూపాయి 11 పైసలు పెరిగి 82.46 వద్ద ముగిసింది.