
Today Nifty hits fresh record hig: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. ముఖ్యంగా నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు ఒక్కరోజులో రూ 3 లక్షల కోట్లను ఆర్జించారు. సెన్సెక్స్ తిరిగి 67,000 మార్కును చేసింది. 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది.
ఇటీవలి మార్కెట్ టర్న్‌అరౌండ్ గ్లోబల్ సూచనలు, స్థిరమైన నిధుల ప్రవాహం , G20 విజయానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. వరుసగా కొనుగోళతో వరుసగా ఏడో రోజు కూడా బుల్ రన్ కొనసాగడం విశేషం. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ టాప్ టూజర్స్‌గా ఉన్నాయి.