Bull run
-
సాక్షి మనీ మంత్రా: బుల్ దౌడు, నిఫ్టీ సరికొత్త రికార్డు
Today Nifty hits fresh record hig: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. ముఖ్యంగా నిఫ్టీ చరిత్రలోనే తొలిసారి 20వేల మార్క్‌ను తాకింది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో తాజా రికార్డు గరిష్ట స్థాయి 20,008.15ను తాకింది. చివరికి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 19,992 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలనార్జించాయి. ఫలితంగా దలాల్ స్ట్రీట్‌లో ఈ ఒక్కరోజే పెట్టుబడిదారులు ఒక్కరోజులో రూ 3 లక్షల కోట్లను ఆర్జించారు. సెన్సెక్స్ తిరిగి 67,000 మార్కును చేసింది. 528 పాయింట్ల లాభంతో 67,127 వద్ద ముగిసింది. ఇటీవలి మార్కెట్ టర్న్అరౌండ్ గ్లోబల్ సూచనలు, స్థిరమైన నిధుల ప్రవాహం , G20 విజయానికి కారణమని మార్కెట్ వర్గాల అంచనా. వరుసగా కొనుగోళతో వరుసగా ఏడో రోజు కూడా బుల్ రన్ కొనసాగడం విశేషం. అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, పవర్ గ్రిడ్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ విన్నర్స్‌గా నిలవగా జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ టాప్ టూజర్స్‌గా ఉన్నాయి. -
రైల్ షేర్ల పరుగు కొనసాగేనా?
ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రైల్వే స్టాక్స్‌లో కొనసాగుతున్న బుల్ రన్‌కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్ షేర్లలో సంస్థాగత ఇ న్వెస్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్ వెలువడిన తదుపరి రైల్ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు. లాభాల పరుగు రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, రైట్స్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ, టిటాగఢ్ వేగన్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్ ఈల్డ్ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్ రంగ స్టాక్స్‌లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు. 38 శాతంతో జోష్ గత బడ్జెట్(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి. -
దలాల్ స్ట్రీట్ దంగల్: ఎన్నాళ్ళకెన్నాళ్లకు బుల్ రన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే భారీ లాభాలనార్జించిన సూచీలు చివరకు వరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి ఫలితంగా సెన్సెక్స్ 54500 ఎగువకు, నిఫ్టీ 16250 స్థాయిని అధిగమించడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది. చివరకు సెన్సెక్స్ 760 పాయింట్లు జంప్ చేసి 54521 వద్ద, నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 16278 వద్ద ముగిసాయి. హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, బజాన్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడ్డాయి. డా. రె డ్డీస్, బ్రిటానియా, మారుతి,నెస్లే టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ఉంది. 10పైసల నష్టంతో 79.96 వద్ద ఉంది. -
మరో సంచలనం.. బాహుబుల్ 60000
ముంబై: స్టాక్ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్‌తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. మార్కెట్లో పండుగ వాతావరణం... దేశీయ మార్కెట్లోని సానుకూలతలతో స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ మిడ్‌సెషన్‌లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సూచీలకు ఐదోవారామూ లాభాలే... బుల్ రన్లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి. సెన్సెక్స్ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. – అశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. మే నెల వాహన విక్రయాలు నిరాశపరిచాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య మన స్టాక్ మార్కెట్ కూడా పడిపోవాలి. కానీ దీనికి భిన్నంగా సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువెత్తింది. కీలక రేట్లను ఆర్బీఐ తగ్గించగలదన్న అంచనాలకు సంస్కరణలు కొనసాగుతాయనే ఆశలు కూడా జత కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను నెలకొల్పాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 12 వేల పాయింట్లపైకి ఎగబాకాయి. ప్రపంచ మార్కెట్లు నష్టపోయినా, ముడి చమురు ధరలు భారీగా పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, రూపాయి బలపడటం సానుకూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల లాభంతో 40,268 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 166 పాయింట్లు పెరిగి 12,089 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 40 వేల పాయింట్ల ఎగువున ముగియడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. మార్కెట్ పరుగు సంబరాల్లో బీఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ తదితరులు రూ.1.76 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.76 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1,76,402 కోట్ల నుంచి రూ.1,56,14,417 కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే..! 1. రేట్ల కోత అంచనాలు గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి చేరిందని కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం వెల్లడించింది. మార్చి క్వార్టర్లో జీడీపీ తగ్గడంతో ఈ వారంలో జరిగే మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బలం పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయని నిపుణులంటున్నారు. 2. ప్యాకేజీ, సంస్కరణలపై ఆశలు.... గత క్యూ4 జీడీపీ ఐదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో వినియోగం జోరును పెంచే సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తెస్తుందనే ఆశలు పెరిగాయి. శుక్రవారం జరిగిన తొలి కేబినెట్ భేటీలో రైతులు, చిన్న వ్యాపారులకు కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం కలిసి వచ్చింది. 3. భారీగా చమురు ధరల పతనం ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి చూస్తే, ముడి చమురు ధరలు 15 శాతం మేర పతనమయ్యాయి. గత శుక్రవారం నాడే 2 శాతం క్షీణించగా, సోమవారం 1 శాతం పతనమయ్యాయి. 4. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గత నెల మొదటి మూడు వారాల వరకూ నికర అమ్మకందారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఎన్నికల ఫలితాల కారణంగా నికర కొనుగోలుదారులుగా మారారు. మొత్తం మే నెలలో రూ.9,031 కోట్లు నికర పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క సోమవారం రోజే రూ.3,069 కోట్ల మేర మ న స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం విశేషం. 5. పుంజుకున్న రూపాయి డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు పుంజుకుని 69.26కు చేరింది. 6. జూన్ రోల్ ఓవర్ల జోరు జూన్ సిరీస్ నిఫ్టీ ఫ్యూచర్స్ రోల్ ఓవర్స్ 72 శాతంగా ఉన్నాయి. ఈ రోల్ ఓవర్స్ మూడు నెలల సగటు 69 శాతమే. మూడు నెలల సగటు కన్నా అధికంగా ఉండటం మార్కెట్ షార్ట్‌టర్మ్ ట్రెండింగ్ పీరియడ్‌లోకి ప్రవేశించడాన్ని సూచిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 7. హెవీ వెయిట్స్ ర్యాలీ సూచీలో హెవీ వెయిట్స్‌ను చూస్తే, సెన్సెక్స్ మొత్తం 553 పాయంట్ల లాభంలో ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాయే 91 పాయింట్లుగా ఉంది. హెచ్డీఎఫ్సీ వాటా 76 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 63 పాయింట్లుగా, టీసీఎస్ వాటా 45 పాయింట్లు, హెచ్‌యూఎల్ వాటా 36 పాయింట్లుగా ఉంది. మొత్తం మీద ఈ ఐదు షేర్ల వాటాయే 311 పాయింట్లుగా ఉంది. మరిన్ని విశేషాలు... ► 31 సెన్సెక్స్ షేర్లలో మూడు షేర్లు –ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీలు నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► బీఎస్ఈలో 19 రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ► నిఫ్టీ 50లో 44 షేర్లు లాభపడగా, ఆరు షేర్లు నష్టపోయాయి. ► మే నెలలో వాహన విక్రయాలు 13 శాతం పెరగడంతో హీరో మోటొకార్ప్ షేర్ 6 శాతం లాభంతో రూ.2,843 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత వారం ముడి చమురు ధరలు బాగా పతనం కావడంతో పెయింట్, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, టైర్, విమానయాన సంస్థల షేర్లు లాభపడ్డాయి. ► విమానయాన ఇంధనం ధరలు తగ్గడంతో విమానయాన రంగ షేర్లు జోరుగా పెరిగాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హై, రూ.157ను తాకిన స్పైస్‌జెట్ చివరకు 4 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. ► నికర లాభం దాదాపు రెట్టింపు కావడంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ షేర్ 10 శాతం పెరిగి రూ.1,360 వద్ద ముగిసింది. ► గత క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతోఅదానీ గ్యాస్‌సహా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► స్టాక్ మార్కెట్ దుమ్మురేపుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ సోమవారం 5 శాతం పతనమై, 30 నెలల కనిష్ట స్థాయి, రూ.388ని తాకింది. చివరకు 5.3 శాతం నష్టంతో రూ.391 వద్ద ముగిసింది. కంపెనీ ప్రమోటరైన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఘోర పరాజయం పాలవడంతో గత ఏడు రోజుల్లో ఈ షేర్ 20 శాతం మేర పతనమైంది. ► ముడి చమురు ధరలు తగ్గడం, రేట్ల కోత అంచనాలు బలం పుంజుకోవడంతో ప్రభుత్వ బాండ్ల రాబడులు పడిపోయాయి. పదేళ్ల బాండ్ల రాబడులు 6.998 శాతానికి చేరాయి. 2017, నవంబర్ తర్వాత బాండ్ల రాబడులు 7 శాతం దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. ► సెన్సెక్స్, నిఫ్టీలతో పాటే ఇంట్రాడేలో పలు షేర్లు ఆల్‌టైమ్ హైలను తాకాయి. బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి -
బుల్ జోరు : మార్కెట్లు జోష్
ముంబై : స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రీ-బడ్జెట్‌కు ముందు మార్కెట్లు రోజురోజు సరికొత్త మైలురాయిలను తాకుతున్నాయి. నేడు తొలిసారి సెన్సెక్స్ కీలకమైన 36వేల మార్కును, నిఫ్టీ 11వేల మార్కును అధిగమించేశాయి. సరికొత్త మైలురాయిలను చేధించిన మార్కెట్లు, చివరికి కూడా గరిష్ట స్థాయిల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 342 పాయింట్లు పెరిగి 36వేల మార్కు పైన 36,139.98 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు ఎగిసి 11వేల మార్కు పైన 11,084 వద్ద క్లోజయ్యాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, వేదంత, హిందాల్కో నేటి మార్కెట్లో టాప్ గెయినర్లుగా ఉండగా.. విప్రో, టాటా మోటార్స్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్ ఎక్కువగా నష్టపోయాయి. కాగ, కేవలం 6 నెలల్లో నిఫ్టీ 11వేల మార్కును బీట్ చేసింది. సెన్సెక్స్ 5 ట్రేడింగ్ సెషన్స్‌లోనే 1000 పాయింట్ జర్నీని పూర్తిచేసి, 36వేల మార్కును అధిగమించింది. నిఫ్టీ తొలిసారి 10వేల మార్కును గతేడాది జూలై 15న తాకగా... అప్పటి నుంచి వన్-వే జర్నీనే నిఫ్టీ కొనసాగిస్తూ వచ్చింది. బ్యాంకులు, మెటల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎన్బీఎఫ్సీ షేర్ల మద్దతుతో నిఫ్టీ దూసుకుపోతోంది. అటు నుంచి విదేశీ పెట్టుబడిదారులు కూడా స్టాక్ మార్కెట్లు పెట్టుబడుల వెల్లువ కొనసాగిస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల లాభంలో 63.82గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 37 రూపాయల లాభంలో 29,871 రూపాయలుగా ఉన్నాయి. -
దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్: సరికొత్త రికార్డు గరిష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుల్‌రన్‌ను అప్రతిహతంగా కొనసాగిస్తున్నాయి. గతరెండు సెషన్స్‌గా కన్సాలిడేషన్ బాటలో సాగినా తిరిగి వారాంతంలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో ఆరంభంలోనే కీలక సూచీలు ఆల్‌టైం గరిష్టాలను మోదు చేశాయి. సెన్సెక్స్ సెంచరీ లాభాలతో 34, 600 పాయింట్లను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స 92 పాయింట్లు ఎగిసి34, 595వద్ద,నిప్టీ 28 పాయింట్ల లాభంతో 10,679 వద్ద కొనసాగుతున్నాయి. స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్ దాదాపు అన్ని రంగాల్లోకు లాభాలే. మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఫార్మా, ఆటో సెక్టార్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. అటు గురువారం డోజోన్స్, ఎస్అండ్పీ, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను తాకడం దేశీయ మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్టు ఎనలిస్టులు పేర్కొంటున్నారు. వేదాంతా, ఐవోసీ, ఐబీ హౌసింగ్, హిందాల్కో, ఐసీఐసీఐ, యాక్సిస్, ఆర్ఐఎల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ లాభాల్లోనూ, క్యూ3 ఫలితాలతో టీసీఎస్ నష్టపోతోంది. అలాగే భారతీ, ఐషర్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
వినోదంలో విషాదం
-
స్పెయిన్‌లో ఉత్సాహంగా 'బుల్ రన్'
-
స్వల్ప లాభాలతో రికవరీ
బ్లూచిప్ షేర్ల పెరుగుదలతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు పెరిగి 28,386 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,476 వద్ద ముగిసింది. ఢిల్లీలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని ప్రభుత్వం పెంచిన సానుకూల పరిణామంతో డీఎల్ఎఫ్ తదితర రియల్టీ స్టాక్స్ ఎగిశాయి. అటు వచ్చే నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెలవారీ ముగింపు ముందు రోజున షార్ట్‌కవరింగ్ కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 4% పెరగ్గా.. విద్యుత్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రియల్టీలో అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ మొదలైన షేర్లు 4-10 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజున 5 శాతం క్షీణించిన ఐటీసీ బుధవారం 2 శాతం మేర పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.