
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఆరంభంలోనే భారీ లాభాలనార్జించిన సూచీలు చివరకు వరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి ఫలితంగా సెన్సెక్స్ 54500 ఎగువకు, నిఫ్టీ 16250 స్థాయిని అధిగమించడంతో దలాల్ స్ట్రీట్ కళకళలాడింది.
చివరకు సెన్సెక్స్ 760 పాయింట్లు జంప్ చేసి 54521 వద్ద, నిఫ్టీ 229 పాయింట్ల లాభంతో 16278 వద్ద ముగిసాయి. హిందాల్కో, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, బజాన్ ఫిన్ సర్వ్ భారీగా లాభపడ్డాయి. డా. రె డ్డీస్, బ్రిటానియా, మారుతి,నెస్లే టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ఉంది. 10పైసల నష్టంతో 79.96 వద్ద ఉంది.