గతేడాది(2020–21) సగటున ప్రతి నెలా 12 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా ఓపెన్ అయ్యాయి. 2019–20లో ఈ సంఖ్య 4 లక్షలు మాత్రమేకాగా.. ఈ ఏడాది(2021–22)లో ఇప్పటివరకూ 26 లక్షలు చొప్పున జత కలుస్తున్నాయి.
అంతేకాకుండా 2020–21కల్లా నగదు విభాగం రోజువారీ టర్నోవర్‌లో రిటైలర్ల వాటా 39 శాతం నుంచి 45 శాతానికి ఎగసింది. లిస్టెడ్ కంపెనీలలో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా సైతం 9.3 శాతానికి బలపడింది.
ఇది అత్యంత ప్రోత్సాహకర విషయమే అయినప్పటికీ క్యాపిటల్ మార్కెట్లలో వ్యక్తిగత పెట్టుబడులు మరింత పెరగవలసి ఉన్నట్లు త్యాగి సూచించారు. గ్లోబల్ గణాంకాల సంస్థ స్టాటిస్టా వివరాల ప్రకారం యూఎస్‌లో సుమారు 55 శాతం పెద్దలు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్లకు మళ్లిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment