దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. చివరకు లాభాల్లో ముగిశాయి.
ఫ్యూచర్ అండ్ ఆప్షన్లు నెలవారీ గడువు ముగింపు, ఐదు రాష్ట్రాల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం ఫెడ్‌ఛైర్మన్ పావెల్ సమావేశం ఉండడంతో కూడా మార్కెట్లో కొంత అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెన్సెక్స్ 87 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 37 పాయింట్ల పుంజుకుని 20,133కు చేరింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 85 పాయింట్ల నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 290 పాయింట్ల మేర లాభంలో నెల చివరి రోజు ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎయిర్ టెల్, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, విప్రో, ఓఎన్‌జీసీ, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, టాటా కన్జూమర్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలతో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment