దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఈ సమయం వరకు ఐటీ స్టాక్‌లు ఎక్కువగా ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తుంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.77 శాతం ఎగబాకింది.
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
వారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్‌లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్‌ను ప్రకటించనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment