
Today Market Closing: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి.రోజంతా పాజిటివ్‌గా కదలాడిన సూచీలు వారాంతంలో కూడా రికార్డు స్థాయిలను టచ్ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు ఎగిసి 66,061 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19,564 వద్ద స్థిరపడ్డాయి.
విశేషాలు
♦ గత రికార్డు గరిష్ట స్థాయి 19,567ను అధిగమించిన నిఫ్టీ 19,570 వద్ద సరికొత్త రికార్డును తాకింది
♦ సెన్సెక్స్ 66159.79 రికార్డు స్థాయిని టచ్ చేసింది
♦ ముఖ్యంగా ఐటీ ఇండెక్స్ ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.
♦ గత రెండు సెషన్లలో దాదాపు 2,000 పాయింట్లు లాభపడింది
♦ టీసీఎస్, టెక్ మహీంద్ర ఇన్ఫోసిస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్
♦ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, డా.రెడ్డీస్, టైటన్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా ముగిసింది. గత ముగింపు 82.07తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 10 పైసలు తగ్గి 82.17 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందించనున్న పూర్తి వీడియో చూడండి