
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లోముగిసాయి. ఆరంభ నష్టాల నుంచి మిడ్‌సెషన్ తరువాత కోలుకున్నప్పటికీ ఆ లాభాలనునిలబెట్టుకోవడం విఫలమైంది. సెన్సెక్స్ 124 పాయింట్లు కుప్పకూలి 60683 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 17857 వద్ద ముగిసింది.
మెటల్ షేర్లు భారీగా నష్టపోగా, రియల్టీ షేర్లు లాభాల్లో ముగిసాయి. టాటా మోటార్స్, యూపీఎల్, సిప్లా, హీరోమోటో, లార్సెన్ టాప్ గెయినర్స్‌గా, అదానీ ఎంటర్‌పప్రైజెస్, హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, కోల్‌ఇండియా టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అలాగే పేటీఎంలో మొత్తం వాటాను అలీబాబా విక్రయించడంతో పేటీఎం షేరు దాదాపు 8శాతం కుప్పకూలింది. అటు ఎంఎస్‌సీఐలో అదానీ కంపెనీల షేర్ల వెయిటేజీ తగ్గించడంతో అదానీకి చెందినకొన్నిషేర్లు నష్టపోయాయి.