సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అత్యధిత స్థాయిల వద్ద ఇన్వెస‍్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో సెన్సెక్స్ 52వేల దిగువకు చేరగా, నిఫ్టీ 15300 స్థాయిని కోల్పోయింది. సెన్సెక్స్ 347పాయింట్లు కుప్పకూలి, 51756 నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 15230 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు నష్టాల్లో, నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్, మీడియా, ఆటో సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఎస్‌బీఐ లాభపడుతుండగా, హెచ్‌డిఎఫ్‌సి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్ భారీగా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment