
సాక్షి,ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ప్రారంభ మైనాయి. అనంతరం మరింత అమ్మకాలు కొనసాగాయి. ఐటి, ఎఫ్‌ఎంసిజి, మెటల్ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫలితంగా 65 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17827 వద్ద, సెన్సెక్స్ 198 పాయింట్లు కోల్పోయి 60610 వద్ద ట్రేడ్ అవుతోంది.
శుక్రవారం కూడా అదానీ షేర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ విన్నర్స్‌గా హెచ్‌సీఎల్ టెక్, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.63ప్రారంభమైనా 82.59 వద్ద పాజిటివ్‌గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment