సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిసాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నప్పటికీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్‌ల వారంవారీ గడువు ముగియనున్న నేపథ్యం, ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాలతో లాభాలు ఆవిరై పోయాయి. రోజంతా ఊగిస లాడిన సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 59958 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 17858 వద్ద స్థిరపడింది. ఫలితంగా సెన్సెక్స్ 60వేల దిగువకు, నిఫ్టీ 17,900 దిగువన ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొన సాగాయి. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోగా, ఐటీ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి.
మరోవైపు ఐటీ దిగ్గజాల డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు, యుఎస్ ద్రవ్యోల్బణ డేటా అంచనాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తత కొనసాగుతోంది. అల్టట్రా టెక్ సిమెంట్, ఎస్‌బీఐ లైఫ్, లార్సెన్. హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లోనూ, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్ర టాప్ లూజర్స్‌గానూ నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్పనష్టాలతో 81.55 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment