
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లోనే ముగిసింది. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్న సెన్సెక్స్ 341, కుప్పకూలి 49161 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు నష్టంతో 14850 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, కోటక్ బ్యాంక్, హిందాల్కో, విప్రో పీఎన్‌బీ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోయాయి.
కోల్ ఇండియా ఐవోసీ,ఎన్‌టీపీసీ అల్ట్రాటెక్, మిడ్‌క్యాప్ షేర్లలో భెల్, కోఫోర్జ్, కాంకోర్, గెయిల్, వోల్టాస్ ఎక్కువ లాభాల్లో ముగిసాయి. మరోవైపు రుపాయి ఫ్లాట్‌గా ముగిసింది. డాలరు మారకంలో ఒక పైసా నష్టంతో 73.34వద్ద క్లోజ్ అయింది.