Twitter Losing Over $4 Million per day, Elon Musk Defends Layoffs
Sakshi News home page

ElonMusk రోజుకు 40 లక్షల డాలర్ల నష్టం! అయినా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తున్నా!

Published Sat, Nov 5 2022 11:35 AM | Last Updated on Sat, Nov 5 2022 12:46 PM

No Choice Twitter losing 4 million dollors per day says Elon Musk - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్‌ కొత్త బాస్‌, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తొలిసారి స్పందించారు.  లేదు..లేదు అంటూనే ట్విటర్‌లో దాదాపు 50 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో ఉన్న మస్క్‌ తాజా తొలగింపులపై ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంతో ఈ వివరణ ఇచ్చారు. దురదృష్టవశాత్తూ తమకు ఇంతకుమించి వేరే మార్గంలేదని ప్రస్తుతం సంస్థ రోజూ 40 లక్షల డాలర్లు నష్టపోతోందని వెల్లడించారు. (ElonMusk ట్విటర్‌ డీల్‌: అమెరికా అధ్యక్షుడి మండిపాటు)

నష్టాలను తగ్గించుకోవడం, కంపెనీ ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం కోసమే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, అంతకు మించి మరో మార్గం లేదని  మస్క్‌  ట్వీట్ చేశారు. అయినా ఉద్యోగం  కోల్పోయిన వారికి మూడు నెలల వేతనం చెల్లిస్తున్నామనీ. నిజానికి చట్టపరంగా చెల్లించాల్సిన దానికంటే 50 శాతం ఎక్కువేనని పేర్కొన్నారు. అలాగే కంటెంట్‌ నియంత్రణకు తాము కట్టబుడి ఉన్నామని మరోసారి స్పష్టం  చేశారు. అంతేకాదు ఈ వారంలో   ద్వేషపూరిత ప్రసంగాలు ఈ వారంలో చాలా తగ్గాయంటూ  ట్వీట్‌ చేశారు. 

44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ బ్లాక్‌బస్టర్ టేకోవర్ తర్వాత కేవలం వారం లోజుల్లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు, 7500 మంది సిబ్బందిలో సగం మందిని శుక్రవారం తొలగించింది. దీనికి ముందు, ట్విటర్‌ ఆఫీసులకు ఆయా ఉద్యోగుల యాక్సెస్‌ను బ్యాన్‌ చేసింది.  దీంతో ట్విటర్‌లో ఉద్యోగాన్ని కోల్పోయిన వారు ప్రపంచ వ్యాప్తంగా  సోషల్‌మీడియాలో ఈ సమాచారాన్ని పంచుకోవడం వైరల్‌గా మారింది.  ముఖ్యంగా  అమెరికా, కెనడా ట్విటర్‌ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మిచెల్ ఆస్టిన్  తనను తొలగించడంపై విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

ట్విటర్‌ డీల్‌ తరువాత కంపెనీ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్న మస్క్‌  ఆమేరకు  ట్విటర్‌ టీంలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్టమైన టార్గెట్‌లను విధించి, దానికిడెడ్‌లైన్‌ కూడా విధించిన సంగతి తెలిసిందే. పొదుపు చర్యల్లో భాగంగా కంపెనీ సీఈవో,టాప్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సాధారణ ఉద్యోగులను ఇంటికి పంపించారు.  కొత్త కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్‌ను ప్రతిపాదన, వెరిఫైడ్‌ ఖాతాల వినియోగదారుల నుండి నెలకు 8 డాలర్లు  వసూలు,  పొదుపు చర్యలు, ఉద్యోగులకు ఎక్కువ పనిగంటలు లాంటి చర్యలతో, అటు పొదుపు, ఇటు ఆదాయ ఆర్జనకు కొత్త మార్గాలను  మస్క్‌ అన్వేషిస్తున్నారని భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement