
సాక్షి ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగానే కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నా, తీవ్ర ఒడిదుడుకుల ధోరణి కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నిఫ్టీ 15వేలకు దిగువకు, సెన్సెక్స్ 50600 స్థాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతంసెన్సెక్స్ 258 పాయింట్ల నష్టంతో 50591 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు క్షీణించి14991 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్ ఐటీ రంగాల్లో అమ్మకాలుకి కనిపిస్తుండగా,అయిల్ రంగ షేర్లు లాభ పడుతున్నాయి. ఓఎన్‌జిసి, గెయిల్, అల్ట్రాటెక్ సిమెంట్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం లాభపడుతుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ , విప్రో, టాటామోటర్స్ , ఎస్‌బీఐ, హిందాల్కో నష్టాల్లోఉన్నాయి.