
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలోనే నష్టాలను మూటగట్టుకున్న సూచీలు , తరువాత మరింత బేజారయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు కోల్పోయి 60,500 దిగువకి, నిఫ్టీ 18000 దిగువనకు పతనమైంది. చివరికి సెన్సెక్స్ 420 పాయింట్లు నష్టపోయి 69613 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల నష్టంతో 18028 వద్ద స్థిరపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 60,600 ఎగువన, నిఫ్టీ 18వేలకు ఎగువన ముగియం విశేషం. అమెరికా ఇన్‌ఫ్లేషన్ డేటాపై దృష్టి, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు వారం F&O గడువు ముగింపు కావడంతో దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.
టాటా మోటార్స్ యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ హెచ్‌యుఎల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా లాభపడ్డాయి. ముఖ్యంగా నైకా షేర్లు ఏకంగా 10 శాతం జంప్ చేశాయి. అటు డాలరుమారకంలో రూపాయి వరుస లాభాలకు చెక్‌పెట్టింది. 40పైసలు కోల్పోయి 81.76 స్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment