సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు వెంటనే మరింత పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 51949 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు నష్టంతో15613 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్ 52 వేల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లునష్టాల్లోకి జారుకున్నాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్లలో అమ్మకాలు మార్కెట్‌నుప్ర భావితం చేస్తున్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు,.లోహాలు, ఫైనాన్షియల్స్, ఆటో, రియాల్టీ సూచికలలో భారీ అమ్మకాల ధోరణి నెలకొంది. రూ .43,500 కోట్ల విలువైన షేర్లను ముఖ్యంగా ఎన్‌ఎస్‌డిఎల్ మూడు విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్నవార్తల మధ్య అదానీ గ్రూప్ స్టాక్స్ (అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్) భారీగా నష్టపోతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ భారీ నష్టాల్లో ఉన్నాయి.
చదవండి: ఇన్వెస్టర్ల సంపద రికార్డు: సెన్సెక్స్ నెక్ట్స్ టార్గెట్
టెక్నాలజీతో మెరుగైన సేవలు
Comments
Please login to add a commentAdd a comment