
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లకు పైన నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 259 పాయింట్లు కుప్పకూలి 58937 వద్ద,నిఫ్టీ 70 పాయింట్టు నష్టపోయి 17585 వద్ద కొనసాగుతున్నాయి. ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ ఇలా దాదాపు అన్ని రంగాలు అమ్మకాలను చూశాయి. అయితే సిమెంట్ షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
శ్రీసిమెంట్స్, ఆషియన్స్‌పెయింట్స్, టాటా, కోల్ ఇండియా లాభపడుతుండగా, ఇండస్‌ఇండ్ బ్యాంకు,భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్, టెక్‌మహీంద్ర రిలయన్స్, నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో రూపాయి మరింత బలహీన పడింది. 12 పైసల నష్టంతో 79.93వద్ద ఉంది. మంగళవారం 79.84 వద్ద ముగిసింది.