న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో బ్రెయిన్‌బీస్ సొల్యూషన్ లిమిటెడ్ నికర నష్టాలు భారీగా పెరిగాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 486 కోట్లను తాకాయి. ఫస్ట్‌క్రై బ్రాండ్ ఓమ్నిచానల్ బిజినెస్ నిర్వాహక కంపెనీ అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 79 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
మొత్తం ఆదాయం మాత్రం రెట్టింపునకుపైగా ఎగసి దాదాపు రూ. 5,633 కోట్లకు చేరింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం 2021–22లో రూ. 2,401 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. వెరసి సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులున్న స్టార్టప్.. ఫస్ట్‌క్రై రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించిన స్టార్టప్‌ల జాబితాలో తాజాగా చేరింది.
అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,568 కోట్ల నుంచి రూ. 6,316 కోట్లకు పెరిగాయి. కాగా.. కంపెనీ ఇటీవల పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో 90 కోట్ల డాలర్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీలో 40 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment