ముంబై: ఏషియా మార్కెట్‌లలో టెక్ షేర్ల అమ్మకాలు భారీగా సాగుతుండటంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 259 పాయింట్లు నష్టపోయి 52,319 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
నేషనల్ స్టాక్ ఎక్సేంజీ 15,761 పాయింట్లతో మొదలై 65 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో15,681 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నెస్టల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment