Asian markets
-
కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
ముంబై: ట్రేడింగ్‌లో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాలు ఆర్జించాయి. బ్యాంకులు, ఫైనాన్స్, ఐటీ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ 600 పాయింట్లు ఎగసి తొలిసారి 76 వేల స్థాయిపై 76,010 వద్ద కొత్త రికార్డును నమోదు చేసింది. నిఫ్టీ 154 పాయింట్లు బలపడి 23,111 వద్ద ఆల్‌టైం అందుకుంది. అయితే ఆఖరి గంటలో సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఇంధన, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 20 పాయింట్లు నష్టపోయి 75,390 వద్ద ముగిసింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 22,932 వద్ద స్థిరపడింది. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.63%, 0.10% చొప్పున రాణించాయి. -
మార్కెట్‌పై యుద్ధ మేఘాలు
ముంబై: రష్యా – ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో కమ్ముకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతో కీలకపాత్ర పోషిస్తున్న ఈ దేశాల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 95 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి. దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్ సూచీలు, అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల కడలిలో కుంగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్‌పైనా ఆ ప్రభావం కనిపించింది. ఇక దేశీయ ప్రతికూలతలను పరిశీలిస్తే.., ఇంటర్ బ్యాంక్ పారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు నష్టపోయి 9 వారాల కనిష్ట స్థాయి 75.60కి పడిపోయింది. దేశీయ మార్కెట్లో సోమవారం ఎఫ్ఐఐలు రూ.4,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది తొలి నెల జనవరి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,747 పాయింట్లు క్షీణించి 56,406 వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఫిబ్రవరి 26 తరువాత ఈ సూచీకిదే అతిపెద్ద నష్టం. నిఫ్టీ 532 పాయింట్లు పతనమైన ఈ ఏడాదిలో తొలిసారి 17,000 స్థాయి దిగువన 16,843 వద్ద ముగిసింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలోని మొత్తం 19 రంగాల ఇండెక్సులు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్, బ్యాంకింగ్ షేర్ల సూచీలు ఐదుశాతానికి పైగా క్షీణించాయి. విస్తృతస్థాయిలో అమ్మకాలు జరగడంతో స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇండెక్సులు నాలుగు చొప్పున నష్టపోయాయి. ఆసియాలో స్టాక్ సూచీలన్నీ ఒకశాతం నుంచి రెండున్న శాతం నష్టపోయాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మార్కెట్లు 1.50%– 3% చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 1,433 క్షీణించి 56,720 వద్ద, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 17,375 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో దిగువస్థాయిల వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించినా.., ఆదిలోనే హంసపాదులాగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఒక దశలో సెన్సెక్స్ 1,858 పాయింట్ల నష్టంతో 56,295 వద్ద, నిఫ్టీ 565 పాయింట్లను కోల్పోయి 16,810 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగివచ్చాయి. లాభాలు ఒక్క షేరుకే... సెన్సెక్స్ సూచీలో 30 షేర్లలో ఒక్క టీవీఎస్(ఒకశాతం లాభం) మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండెక్సుల్లో దిగ్గజాలైన టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ షేర్లు అత్యధికంగా ఐదున్నర శాతం క్షీణించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, విప్రో షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. సూచీలో అధిక వెయిటేజీ షేరు రిలయన్స్ షేరు రెండు శాతం నష్టపోయింది. రెండురోజుల్లో రూ.12.43 లక్షల కోట్లు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ ప్రతికూలతలతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్ సూచీ 2,520 పాయింట్లు, నిఫ్టీ 763 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీల భారీ పతనంతో గడిచిన రెండురోజుల్లో బీఎస్ఈలో రూ.12.43 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గతవారాంతపు రోజైన శుక్రవారం రూ. 3.91 లక్షల కోట్లు, ఈ సోమవారం రూ.8.47 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది. ‘ఊహించినట్లే ప్రపంచ ప్రతికూలతలు దేశీయ మార్కెట్ పతనాన్ని శాసించాయి. కొన్ని వారాల స్థిరీకరణ తర్వాత మార్కెట్‌పై బేర్స్ పట్టు సాధించాయి. రష్యా – ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న క్రూడ్ ధరలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రానున్న రోజుల్లో సూచీలకు అంతర్జాతీయ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఏకంగా 23 శాతం ఎగసి 22.98 స్థాయికి చేరుకుంది. ► నష్టాల మార్కెట్లో టీసీఎస్ షేరు మాత్రమే ఒకశాతం లాభపడి రూ.3734 వద్ద ముగిసింది. బైబ్యాక్ రికార్డు తేదీ(ఫిబ్రవరి 23)ని ప్రకటించడం షేరు రాణించేందుకు కారణమైంది. ► స్పైస్‌జెట్ ఆఫర్‌ను కళానిధి మారన్ తిరస్కరించడంతో ఆ షేరు ఐదున్నర శాతం క్షీణించి రూ.59 వద్ద స్థిరపడింది. ► బ్యాంకింగ్ షేర్ల పతనంలో భాగంగా ఐసీఐసీఐ షేరు పదినెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. బీఎస్ఈలో 5% పతనమై రూ.754 వద్ద ముగిసింది. -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
ముంబై: ఏషియా మార్కెట్లలో టెక్ షేర్ల అమ్మకాలు భారీగా సాగుతుండటంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో దేశీ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ ఈ రోజు ఉదయం 52,673 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలు ప్రారంభించడంతో వెనువెంటనే పాయింట్లు కోల్పోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 259 పాయింట్లు నష్టపోయి 52,319 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ 15,761 పాయింట్లతో మొదలై 65 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో15,681 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నెస్టల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి. -
ఆసియా దూకుడు- యూఎస్ అప్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్ కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కార్పొరేట్లకు అండగా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలో సవరణలు చేపట్టింది. తద్వారా అర్హతగల అన్ని కార్పొరేట్ బాండ్ల కొనుగోలుకి బ్యాంకులకు వీలు చిక్కనుంది. ఇందుకు వీలుగా బ్యాంకుల వద్ద ఇప్పటికే పేరుకుపోయిన పలు కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఫెడ్ మరిన్ని నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్చేయనుంది. ఈ వార్తలతో సోమవారం యూఎస్ మార్కెట్లు తొలుత ఏర్పడ్డ భారీ నష్టాల నుంచి బయటపడ్డాయి. చివరికి లాభాలతో నిలిచాయి. తొలుత 600 పాయింట్లు పతనమైన డోజోన్స్ చివర్లో 158 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 25,763 వద్ద నిలిచింది. ప్రస్తుతం డో ఫ్యూచర్స్ మరో 250 పాయింట్ల లాభంతో కదులుతోంది. ఇక ఎస్అండ్పీ 25 పాయింట్లు(0.85 శాతం) బలపడి 3,067 వద్ద స్థిరపడగా.. ఫ్యూచర్స్ 1.4 శాతం ఎగసింది. ఇక.. నాస్డాక్ 137 పాయింట్లు(1.45 శాతం) పుంజుకుని 9,726 వద్ద ముగిసింది. కాగా.. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కొనుగోలుకి ఇజ్రాయెల్ ఆసక్తి చూపుతున్న వార్తలతో హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 7.5 శాతం జంప్‌చేసింది. ఫెడ్ చర్యలు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడరల్ రిజర్వ్ సోమవారం నుంచీ బ్యాంకులకు మరో అవకాశాన్ని కల్పించింది. దీనిలో భాగంగా కరోనా వైరస్ తలెత్తకముందు మంచి పనితీరు ప్రదర్శించిన కంపెనీలకు ఆర్థికంగా అండను కల్పించనుంది. 15,000 మందివరకూ ఉద్యోగులు కలిగిన లేదా 5 బిలియన్ డాలర్ల వరక ఆదాయం కలిగిన కంపెనీలకు బ్యాంకులు తాజాగా రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించనుంది. ఉద్యోగులను కొనసాగించడం, వ్యాపార నిర్వహణకు వీలుగా కంపెనీలకు బ్యాంకులు రుణాలందించనున్నాయి. అర్హతగల కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా 600 బిలియన్ డాలర్లను ఫెడ్ కేటాయించింది. జోరు తీరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చిన దన్నుతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లకు జోష్వచ్చింది. దీంతో కొరియా, జపాన్, హాంకాంగ్, ఇండొనేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్ 4-2 శాతం మధ్య జంప్‌చేయగా.. చైనా 1 శాతం పుంజుకుంది. వరుసగా రెండో నెలలోనూ చైనాలో పరిశ్రమలు ఉత్పత్తిని పెంచినట్లు వెలువడిన వార్తలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
9,500 పాయింట్ల పైకి నిఫ్టీ
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభపడింది. బ్యాంక్, ఆర్థిక రంగ, ఐటీ షేర్ల దన్నుతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు మంచి లాభాలు సాధించాయి. సెన్సెక్స్ 32,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,500 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 52 పైసలు పుంజుకోవడం, మరొక్క రోజులో ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం, త్వరలోనే భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించనున్నదన్న ఆశలు, లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగిస్తారన్న వార్తలు, అంతర్జాతీయ సంకేతాలు అనుకూలంగా ఉండటం.. సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 783 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 606 పాయింట్ల లాభంతో 32,720 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 172 పాయింట్లు ఎగసి 9,553 పాయింట్ల వద్దకు చేరింది. రోజంతా లాభాలు.... పలు దేశాలు లాక్‌డౌన్‌ను సడలించాయి. మరోవైపు వడ్డీరేట్లపై కీలక నిర్ణయాన్ని నేడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించనున్నది. సానుకూల నిర్ణయం వెలువడుతుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభాలతో ఆరంభమయ్యాయి. ఈ జోరుతో మన మార్కెట్ కూడా లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. బ్యాంక్, ఆర్థిక రంగ, ఐటీ, లోహ, వాహన రంగ షేర్లు లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు 1 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 2 నుంచి 3 శాతం రేంజ్ లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ జోడీ జోరు.... హెచ్డీఎఫ్సీ షేర్ 7 శాతం లాభంతో రూ.1,837 వద్దకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ 5 శాతం లాభంతో రూ.977 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన మొదటి రెండు షేర్లు ఇవే. ఈ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకుందని నిపుణులంటున్నారు. కాగా మొత్తం సెన్సెక్స్ 606 పాయింట్ల లాభంలో ఈ రెండు షేర్ల వాటాయే సగానికి పైగా ఉండటం విశేషం. సెన్సెక్స్ లాభాల్లో హెచ్డీఎఫ్సీ వాటా 198 పాయింట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 183 పాయింట్లుగా ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.09 లక్షల కోట్లు పెరిగి రూ.126.22 లక్షల కోట్లకు చేరింది. ► గత క్యూ4లో రూ.1,388 కోట్ల నికర నష్టాలు రావడంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ 4 శాతం నష్టంతో రూ.439 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. హెచ్ఈజీ, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, ఆవాస్ ఫైనాన్షియర్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. భారీ లాభాల్లో అమెరికా మార్కెట్ అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ కంపెనీ ఔషధం, రెమ్డీసివిర్... కరోనా వైరస్ చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందన్న వార్తలతో అమెరికా స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. రాత్రి గం.11.30 ని.లకు నాస్డాక్, డోజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 2–3 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ మినహా మిగిలిన అన్ని ఏడీఆర్‌లు(హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ డీవీఆర్, ఇన్ఫోసిస్, విప్రో)3–15% రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ గురువారం భారీ గ్యాపప్‌తో మొదలవుతుందని అంచనా. -
భారీ లాభాల్లో ప్రపంచ మార్కెట్లు
హాంకాంగ్/న్యూయార్క్: కొన్ని దేశాల్లో ‘కరోనా’ మరణాలు తగ్గడంతో సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. కరోనా హాట్‌స్పాట్ దేశాలైన ఇటలీ, స్పెయిన్‌ల్లో కొత్త కేసులు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు 2–4 శాతం, యూరప్ మార్కెట్లు 3–6 శాతం లాభపడగా, రాత్రి గం. 11.30 ని.లకు అమెరికా స్టాక్ సూచీలు 5–6 శాతం రేంజ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా సోమవారం మన మార్కెట్ పనిచేయలేదు. ఒకవేళ మన స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడింగ్ జరిగి ఉంటే, సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 3 శాతం లాభపడి ఉండేవని నిపుణులంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా కేసులు 12 లక్షలకు, మరణాలు 70,000కు పెరిగాయి. అయితే కొన్ని యూరప్ దేశాల్లో మరణాలు అంతకు ముందటి రోజుల కంటే తగ్గడంతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఇటలీలో రెండు వారాల్లో కనిష్ట మరణాలు ఆదివారమే నమోదయ్యాయి. మరోవైపు స్పెయిన్‌లో మరణాల సంఖ్య వరుసగా మూడో రోజూ తగ్గింది. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గింది. ఇక అమెరికాలో కేసుల సంఖ్య నిలకడ స్థాయికి చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించడం కలసి వచ్చింది. ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సోమవారం మొదటి సెషన్లో 4 శాతం లాభపడగా, రెండో సెషన్లో 1 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో నేడు (మంగళవారం) సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాప్ అప్‌తో మొదలవుతాయని అంచనా. -
స్వల్ప లాభాలతో సరి
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ, బ్యాంక్ షేర్ల దన్నుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. చివరి అరగంట కొనుగోళ్ల పుణ్యమాని ఈ రెండు సూచీలు లాభపడ్డాయి. రోజంతా 266 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల లాభంతో 40,345 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు పెరిగి 11,913 పాయింట్ల వద్దకు చేరింది. బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు.... హాంగ్‌కాంగ్‌లో రాజకీయంగా ఉద్రిక్తతలు మరింత ప్రజ్వరిల్లడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. మూడీస్ సంస్థ మన క్రెడిట్ అవుట్ లుక్ రేటింగ్‌ను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. మార్కెట్ ముగిసిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రూపాయి మారకం 18 పైసలు పతనమై 71.47కు చేరింది. ముడి చమురు ధరలు 1 శాతం మేర తగ్గినప్పటికీ, ఎలాంటి ప్రభావం కనిపించలేదు. సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. తర్వాత తేరుకొని లాభాల్లోకి మళ్లింది. తర్వాత అరగంటలోనే మళ్లీ నష్టాల్లోకి జారింది. చివరి అరగంట వరకూ నష్టాల్లోనే ట్రేడైంది. బ్యాంక్, కొన్ని ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా లాభాల్లో ముగిసింది. ఒక దశలో 173 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 93 పాయింట్లు లాభపడింది. రోజంతా 266 పాయింట్ల రేంజ్లో తిరిగింది. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా మొదలై, నష్టాల్లో ముగిశాయి. - యెస్ బ్యాంక్ షేర్ 5.8 శాతం లాభంతో రూ.73 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. గత 26 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 150 శాతం ఎగియడం విశేషం. -
మార్కెట్‌కు ద్రవ్యలోటు పోటు
ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే ఆందోళనల కారణంగా స్టాక్ మార్కెట్ గురువారం భారీగా నష్టపోయింది. ఆసియా మార్కెట్ల పతనం, జీడీపీ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న సందేహాలు, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపు రోజు కావడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపడంతో స్టాక్ సూచీలు భారీగా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 453 పాయింట్లు నష్టపోయి 33,149 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 135 పాయింట్లు నష్టపోయి 10,227 పాయింట్ల వద్ద ముగిశాయి. గడిచిన ఏడాది కాలంలో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 494 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్ల వరకూ నష్టపోయాయి. రియల్టీ సూచీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. దెబ్బతిన్న సెంటిమెంట్ ద్రవ్యలోటు పెరగడంతో మార్కెట్, రూపాయి పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఒపెక్ చమురు కోత కొనసాగుతుందనే అంచనాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారని వివరించారు. నవంబర్ సిరీస్ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ, ఆసియా మార్కెట్లు నష్టపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఇవీ పతనానికి కారణాలు... 96.1%కి ద్రవ్యలోటు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో ద్రవ్యలోటు 96.3%కి పెరిగింది. ఆదాయం తక్కువగా ఉండడం, వ్యయం పెరగడంతో ద్రవ్యలోటు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి రూ.4.2 లక్షల కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.5.25 లక్షల కోట్లకు పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతానికే ద్రవ్యలోటును పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం విఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న అంచనాలు మార్కెట్‌ను పడగొట్టాయి. జీడీపీ గణాంకాల వెల్లడి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో తైమాసిక జీడీపీ గణాంకాలను మార్కెట్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. ఈ గణాంకాలు సానుకూలంగా ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, స్టాక్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. నవంబర్ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ: నవంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు కావడంతో స్టాక్ సూచీలు ఒడిదుడుకుల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్ల పతనం: జపాన్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్ల పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మైక్రో చిప్‌ల బూమ్ శిఖర స్థాయికి చేరిందన అంచనాల కారణంగా టెక్నాలజీ షేర్ల పతనంతో ఆసియా మార్కెట్లు క్షీణించాయి. హాంగ్‌సెంగ్ 1.5%, షాంఘై 0.6% చొప్పున నష్టపోయాయి. కొరియా ఉద్రిక్తతలు: ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. అమెరికాపై కొరియా అణ్వాయుధాలతో దాడులు చేయవచ్చన్న ఆందోళనలు పెరిగాయి. పుంజుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ: అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో భారత్ వంటి దేశాల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధులు అమెరికా మార్కెట్‌కు తరలిపోతాయనే అంచనాలున్నాయి. ఒపెక్ సమావేశం: ఉత్పత్తిలో కోత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పుంజుకోవడం చమురు దేశాలకు ఊరటనిస్తోంది. ఉత్పత్తి కోతను కొనసాగించడానికి ఉద్దేశించిన ఒపెక్ సమావేశం జరగనుండడం ప్రతికూల ప్రభావం చూపించింది. లాభాల స్వీకరణ: గత మూడు రోజుల పతనానికి ముందు వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్ల పాటు స్టాక్ సూచీలు లాభపడ్డాయి. రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 31 పైసలు క్షీణించి 64.62కు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. -
పాజిటివ్ సంకేతాలు : జంప్ చేసిన మార్కెట్లు
ముంబై: రెండు రోజులుగా అనిశ్చితంగా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఆసియన్ స్టాక్ మార్కెట్లు ఊతమిచ్చాయి. ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో దేశీయ బెంచ్ మార్కు సూచీలు గురువారం మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 100 పాయింట్లకు పైగా జంప్ చేసింది. ప్రస్తుతం 126.50 పాయింట్ల లాభంలో 31,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయిలో 36.60 పాయింట్ల లాభంలో 9,670 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ గా వస్తున్న సంకేతాలు పాజిటివ్ గా ఉండటంతో మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ లు 0.3శాతం, 0.5 శాతం పైకి ఎగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 9670 మార్కును తాకడంతో 9700 మార్కువరకు ట్రేడ్ కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీర్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పేయింట్స్, అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మాలు 1-1.5 శాతం మేర లాభపడ్డాయి. హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, విప్రో, లుపిన్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, గెయిల్, టాటా పవర్ లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.53 వద్ద ప్రారంభమైంది. 10 నెలల కనిష్టానికి పడిపోయిన ఆయిల్ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆసియన్ మార్కెట్లు కోలుకున్నాయి. -
లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 181పాయింట్ల లాభంతో 27, 808 దగ్గర, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8521 దగ్గర క్లోజయ్యాయి. నిఫ్టీ చాలా కాలం తర్వాత 85 వేల మార్క్ దగ్గర స్థిరంగా ముగిసింది. ఆసియా మార్కెట్ల సానుకూలంగా ఉండడంతో మదుపర్లుకొనుగోళ్లవైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. మరోవైపు కెయిర్న్ ఎనర్జీ నష్టపరిహారం కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసిందన్న వార్తలతో ఆ షేర్ బాగా లాభపడింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే అంచనాలు దలాల్ స్ట్రీట్ కు సానుకూలంగా ఉన్నాయని ఎనలిస్టుల విశ్లేషిస్తున్నారు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి పాజిటివ్ గా ఉంది. 0.01 పైసల లాభంతో 67.13 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర మరింత తగ్గింది. 94 రూపాయల నష్టంతో 31,484 దగ్గర ఉంది. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంతో 27, 699 దగ్గర, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 8489 దగ్గర ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల సానుకూలంగా ఉండడంతో భారత మార్కెట్లు పాజిటివ్ గా వున్నాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. సోమవారం భారత సూచీలు 11 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ రోజుకూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి మైనస్ లో ఉంది. 0.004 పైసల నష్టంతో 67.18 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర 29 రూపాయల నష్టంతో 31,549 దగ్గర ఉంది. -
నష్టాల్లో కీలక ఈక్విటీ సూచీలు
ముంబై : కీలక దేశీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో, స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోతూ.. 27,093 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పడిపోతూ.. 8,305 వద్ద కదలాడుతున్నాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరడగంతో, కీలక సూచీలు మార్నింగ్ సెషన్ లో నష్టాలను నమోదుచేస్తున్నాయి.. మరోవైపు ఆసియన్ మార్కెట్లు సైతం నష్టాలను ట్రేడ్ అవుతున్నాయి.. అయితే ఇన్ఫోసిస్, లుపిన్, రిలయెన్స్ ఇన్ ఫ్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదుచేస్తున్నాయి. యూకే బేస్డ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ 17శాతం పైగా ఎక్కువగా జూన్ అమ్మకాలను నమోదుచేయడంతో, టాటా మోటార్స్ షేర్లు 2శాతం అధికంగా లాభాల బాట పట్టాయి. ఫ్రీ-బ్రెగ్జిట్, పోస్ట్- బ్రెగ్జిట్ పరిస్థితులకు నిలదొక్కుకొని, ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన నిలిచిన దేశీయ మార్కెట్ .. త్వరలో ప్రారంభకాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు పేర్కొంటున్నారు. జీఎస్ టీ బిల్లు ఆమోదంపై చాలా స్టాక్స్ ఆధారపడి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు మార్కెట్లో పరుగులు పెట్టిన పసిడికి కొంత బ్రేక్ పడింది. పసిడి రూ.66 నష్టపోతూ.. రూ.31,815గా నమోదవుతోంది. వెండి సైతం రూ.97 నష్టాల్లో నమోదవుతూ రూ.46,796గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.47గా ఉంది. -
సెన్సెక్స్ 247 పాయింట్లు డౌన్
- 25,617 పాయింట్ల వద్ద ముగింపు - 73 పాయింట్ల నష్టంతో 7,796కు నిఫ్టీ ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం ప్రభావం చూపాయి. చివరి గంటన్నరలో అమ్మకాలు పోటెత్తాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. అక్టోబర్ సిరీస్ తొలిరోజున బీఎస్ఈ సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 25,617 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో 7,796 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక దశలో 25,937 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 247 పాయింట్ల నష్టపోయింది. కాగా ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 49 శాతానికి తగ్గనుందన్న వార్తల నేపథ్యంలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 30 శాతం వరకూ పెరిగింది. 7శాతం లాభంతో రూ.79 వద్ద ముగిసింది. ఆసిడిటీ చికిత్సలో ఉపయోగపడే ఆస్ట్రాజెనెకా నెక్సియమ్‌కు జనరిక్ ఔషధాన్ని అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ బీఎస్ఈలో 5.3 శాతం పెరిగి రూ.4,185 వద్ద ముగిసింది.