నష్టాల్లో కీలక ఈక్విటీ సూచీలు
ముంబై : కీలక దేశీయ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతుండటంతో, స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు కోల్పోతూ.. 27,093 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు పడిపోతూ.. 8,305 వద్ద కదలాడుతున్నాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరడగంతో, కీలక సూచీలు మార్నింగ్ సెషన్ లో నష్టాలను నమోదుచేస్తున్నాయి.. మరోవైపు ఆసియన్ మార్కెట్లు సైతం నష్టాలను ట్రేడ్ అవుతున్నాయి..
అయితే ఇన్ఫోసిస్, లుపిన్, రిలయెన్స్ ఇన్ ఫ్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ, టీసీఎస్ షేర్లు లాభాలను నమోదుచేస్తున్నాయి. యూకే బేస్డ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ 17శాతం పైగా ఎక్కువగా జూన్ అమ్మకాలను నమోదుచేయడంతో, టాటా మోటార్స్ షేర్లు 2శాతం అధికంగా లాభాల బాట పట్టాయి.
ఫ్రీ-బ్రెగ్జిట్, పోస్ట్- బ్రెగ్జిట్ పరిస్థితులకు నిలదొక్కుకొని, ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన నిలిచిన దేశీయ మార్కెట్ .. త్వరలో ప్రారంభకాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఎక్కువగా దృష్టిసారించినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు పేర్కొంటున్నారు. జీఎస్ టీ బిల్లు ఆమోదంపై చాలా స్టాక్స్ ఆధారపడి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు మార్కెట్లో పరుగులు పెట్టిన పసిడికి కొంత బ్రేక్ పడింది. పసిడి రూ.66 నష్టపోతూ.. రూ.31,815గా నమోదవుతోంది. వెండి సైతం రూ.97 నష్టాల్లో నమోదవుతూ రూ.46,796గా ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 67.47గా ఉంది.