పాజిటివ్ సంకేతాలు : జంప్ చేసిన మార్కెట్లు
Published Thu, Jun 22 2017 9:38 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
ముంబై: రెండు రోజులుగా అనిశ్చితంగా ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఆసియన్ స్టాక్ మార్కెట్లు ఊతమిచ్చాయి. ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలతో దేశీయ బెంచ్ మార్కు సూచీలు గురువారం మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ ఒక్కసారిగా 100 పాయింట్లకు పైగా జంప్ చేసింది. ప్రస్తుతం 126.50 పాయింట్ల లాభంలో 31,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయిలో 36.60 పాయింట్ల లాభంలో 9,670 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ గా వస్తున్న సంకేతాలు పాజిటివ్ గా ఉండటంతో మార్కెట్లు మళ్లీ ఊపందుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు.
బీఎస్ఈ మిడ్ క్యాప్, బీఎస్ఈ స్మాల్ క్యాప్ లు 0.3శాతం, 0.5 శాతం పైకి ఎగిశాయి. ప్రస్తుతం నిఫ్టీ 9670 మార్కును తాకడంతో 9700 మార్కువరకు ట్రేడ్ కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీర్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పేయింట్స్, అంబుజా సిమెంట్స్, అరబిందో ఫార్మాలు 1-1.5 శాతం మేర లాభపడ్డాయి. హెచ్యూఎల్, ఓఎన్జీసీ, విప్రో, లుపిన్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, గెయిల్, టాటా పవర్ లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.53 వద్ద ప్రారంభమైంది. 10 నెలల కనిష్టానికి పడిపోయిన ఆయిల్ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆసియన్ మార్కెట్లు కోలుకున్నాయి.
Advertisement
Advertisement