ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 181పాయింట్ల లాభంతో 27, 808 దగ్గర, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 8521 దగ్గర క్లోజయ్యాయి. నిఫ్టీ చాలా కాలం తర్వాత 85 వేల మార్క్ దగ్గర స్థిరంగా ముగిసింది. ఆసియా మార్కెట్ల సానుకూలంగా ఉండడంతో మదుపర్లుకొనుగోళ్లవైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. మరోవైపు కెయిర్న్ ఎనర్జీ నష్టపరిహారం కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై పిటిషన్ దాఖలు చేసిందన్న వార్తలతో ఆ షేర్ బాగా లాభపడింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందనే అంచనాలు దలాల్ స్ట్రీట్ కు సానుకూలంగా ఉన్నాయని ఎనలిస్టుల విశ్లేషిస్తున్నారు.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి పాజిటివ్ గా ఉంది. 0.01 పైసల లాభంతో 67.13 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర మరింత తగ్గింది. 94 రూపాయల నష్టంతో 31,484 దగ్గర ఉంది.