సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించిన సూచీలు ఆ తరువాత మరింత నష్టపోతున్నాయి. సెన్సెక్స్ 450 పాయింట్లకు పైగా నష్టంతో 61500 దిగువన ట్రేడవుతుండగా, 130 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 18,150 స్థాయిని కోల్పోయింది. ఐటీ , ఫైనాన్షియల్ షేర్లలో నష్టాలు ప్రభావితం చేస్తున్నాయి. నష్టాలు మరింత కొనసాగుతున్నాయి.
(టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు)
హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్ బాగా లాభపడుతుండగా హెచ్‌సిఎల్ టెక్, కోటక్ బ్యాంక్ టాప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. అదానీ హిండెన్‌బర్ వివాదంలో సెబీ అప్పీల్‌ను స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన నేపథ్యంల నేటి (బుధవారం)సెషన్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment